ఫోటో స్టోరి: న‌డువొంపులు నాభి సొగ‌సుతో చంపేస్తోంది

అవును.. ఆమె నాగినిలా మాయ చేస్తోంది! నాగ స్వ‌రం ముందు ఆడే త్రాచులా క‌నిపిస్తోంది.

Update: 2024-07-29 02:30 GMT

అవును.. ఆమె నాగినిలా మాయ చేస్తోంది! నాగ స్వ‌రం ముందు ఆడే త్రాచులా క‌నిపిస్తోంది. ఆ అందాల‌ న‌య‌గారం న‌డువొంపులు.. నాభి సొగ‌సుతో కిల్ చేస్తోంది. వాలు చూపుల‌తో వ‌ల‌లు విసురుతోంది. ఈ బ్యూటీ ట్రాప్ లో ప‌డ‌నిది.. వ‌ల‌ల‌కు చిక్క‌నిది ఎవ‌రు? కచ్ఛితంగా ఈ అందానికి దాసోహం అనాల్సిందే.


బుల్లితెర నుంచి వెండితెర‌కు ప్ర‌మోటైన మౌనిరాయ్ గురించే ఇదంతా. ఏక్తా క‌పూర్ నిర్మించిన‌ బుల్లితెర షో` క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ`తో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన మౌని రాయ్, గోల్డ్ చిత్రంతో సినీరంగంలో ప్ర‌వేశించింది. సినిమాలు చేస్తూనే మ్యూజిక్ వీడియోలలో విజయవంతమైన పరివర్తనను సాధించింది. త‌న‌దైన‌ అద్భుత రూపం ప్ర‌తిభ‌తో మెస్మ‌రైజ్ చేసింది ఈ బ్యూటీ. మౌనికి సోష‌ల్ మీడియాల్లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది. ఇప్ప‌టికే త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా విభిన్న‌మై లుక్ ల‌తో నిండి ఉంది. మౌని తాజాగా న‌ల్ల కోక‌లో సింగారం ఒల‌క‌బోసిన ఫోటోలు ఇప్పుడు ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.


ఇదిగో ఇలా సోఫాపై చిత్ర‌విచిత్ర‌మైన భంగిమ‌ల‌తో ఫోజులివ్వ‌గా అవ‌న్నీ వైర‌ల్ గా మారిపోతున్నాయి. ముఖ్యంగా మౌని త‌న స‌న్న‌జాజి న‌డుము, నాభి సౌంద‌ర్యాన్ని ఎలివేట్ చేస్తూ ఫోజులిచ్చింది. వెబ్ లో ఇవ‌న్నీ స్పీడ్ గా దూసుకెళుతున్నాయి.


హిందీ టెలివిజన్ పరిశ్రమలో పాపుల‌ర్ నేమ్ మౌని రాయ్ `నాగిన్`, నాగిన్ సీక్వెల్‌లో మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా అగ్రస్థానానికి ఎగబాకింది. త‌నదైన న‌ట‌న‌, ఫ్యాష‌న్ సెన్స్ తో సినీప్ర‌ముఖుల దృష్టిని విశేషంగా ఆక‌ర్షించింది. ఇక మౌని బోల్డ్ స్టైల్ ఎంపికలతో తన అభిమానులను నిరంతరం ఆశ్చర్యపరుస్తుంది.


నాగిన్‌లో నటించిన తర్వాత గొప్ప పాపులారిటీ సంపాదించిన‌ మౌని 2018లో అక్షయ్ కుమార్ `గోల్డ్` చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. గత సంవత్సరం మౌని అయాన్ ముఖర్జీ చిత్రం `బ్రహ్మాస్త్ర`లో కనిపించింది. ఇటీవల జుబిన్ నౌటియాల్‌తో కలిసి `డోటరా` అనే మ్యూజిక్ వీడియోలో కూడా కనిపించింది. మౌని రాయ్ వెబ్ సిరీస్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీలో కూడా కనిపించింది. చివరిగా ఇమ్రాన్ హష్మీ నటించిన షోటైమ్‌లో కనిపించింది.

ఇటీవలి ఇంటర్వ్యూలో మౌని మాట్లాడుతూ.. సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ, బ్రహ్మాస్త్ర వంటి ప్రాజెక్టులు త‌న న‌ట‌న‌పై ప్రజల అభిప్రాయాన్ని మార్చాయని వ్యాఖ్యానించింది. కెరీర్ లో వైవిధ్య‌మైన పాత్ర‌లు త‌న‌వైపు వ‌స్తున్నాయ‌ని ఆనందం వ్య‌క్తం చేసింది. త‌న‌లోని బోల్డ్ కోణాన్ని ఆవిష్క‌రించే ఛాన్స్ కూడా ఉంద‌ని తెలిపింది.

Tags:    

Similar News