.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

అమితాబ్ ను సరిగ్గా వాడుకుంది ఆ ఇద్దరే!

అదే సమయంలో రామ్ గోపాల్ వర్మ, నాగ్ అశ్విన్ లాంటి టాలీవుడ్ డైరెక్టర్స్.. ఈ వయసులో అమితాబ్ బచ్చన్ ను ఎలివేట్ చేసే అధ్బుతమైన పాత్రలు అందించారు.

Update: 2024-06-29 09:36 GMT

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ మూవీ 'కల్కి 2898 AD'. గురువారం వరల్డ్ వైడ్ గా రిలీజైన ఫ్యూచరిస్టిక్ ఇండియన్ సినిమా, బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టింది. మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో పాటుగా ప్రధాన పాత్రధారుల నటన హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రకు, ఆయన నటనకు అంతటా ప్రశంసలు దక్కుతున్నాయి.

 

'కల్కి' సినిమాలో అశ్వద్ధామ పాత్రలో నటించారు బాలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. కృష్ణుడి శాపం వల్ల ద్వాపరయుగం నుంచి 6 వేల సంవత్సరాలకు పైగా భూమిపై జీవిస్తున్న అమరుడిగా కనిపించారు. ఈ ఐకానిక్ క్యారక్టర్ కు బిగ్ బీ పర్పెక్ట్ గా సూట్ అవ్వడమే కాదు, అద్భుతమైన నటన కనబరిచారు. 3 గంటల మూవీలో ఆయన 25 నిమిషాల పాటు కనిపించి, సినిమా మొత్తాన్ని ప్రభాస్ తో కలిసి తన భుజాలపై మోసారు. 81 ఏళ్ల వయసులోనూ ప్రభాస్ కు ధీటుగా యాక్షన్ సీన్స్ చేశారు. 'ది హాబిట్' 'ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్' వంటి హాలీవుడ్ చిత్రాల్లోని గాండాల్ఫ్ ను గుర్తు చేశారు.

 

కల్కి సినిమా కోసం అమితాబ్ బచ్చన్ చాలా కష్టపడ్డారు. కర్రతో ఫైట్ సీక్వెన్స్ కోసం సెట్స్ లో ప్రాక్టీస్ చేశారు. అందుకే ఇప్పుడు భైరవ, అశ్వత్థామ పాత్రల మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. ఇక అశ్వత్థామగా మేకప్ వేసుకోడానికి, దాన్ని తీసేయడానికి కొన్ని గంటల సమయం పట్టేదని చిత్ర బృందం తెలిపింది. అయినా సరే ఆయన అంతసేపూ ఎంతో ఓపికగా ఉండి, షూటింగ్ చేసేవారట. ఇది సినిమాపై ఆయనకున్న నిబద్ధత, అంకింతభావాలను తెలియజేస్తుంది.

Read more!

ఒకప్పుడు హిందీ చిత్ర పరిశ్రమలో యాక్షన్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్.. కొన్నాళ్లపాటు బాలీవుడ్‌ ను ఏలారు. 20స్ లో ఆయన నటనకు ప్రాధాన్యమున్న చిత్రాల వైపే మొగ్గు చూపుతూ వస్తున్నారు. కానీ ఆయన వయసుకు తగ్గ పాత్రను రూపొందించడంలో చాలా మంది బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఫెయిల్ అయ్యారు. సినిమాలు హిట్ చేస్తున్నారు కానీ, బిగ్ బీ రేంజ్ కి తగిన పాత్రలు మాత్రం హిందీ దర్శక రచయితలు రాయలేకపోయారు.

అదే సమయంలో రామ్ గోపాల్ వర్మ, నాగ్ అశ్విన్ లాంటి టాలీవుడ్ డైరెక్టర్స్.. ఈ వయసులో అమితాబ్ బచ్చన్ ను ఎలివేట్ చేసే అధ్బుతమైన పాత్రలు అందించారు. 2005, 2008లో అమితాబ్ తో ఆర్జీవి తీసిన 'సర్కార్', 'సర్కార్ రాజ్' సినిమాలను సినీ అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు. సుభాష్ నాగ్రే అలియాస్ సర్కార్ గా దర్శకుడు ఆయన్ను నెక్ట్ లెవల్ లో ఆవిష్కరించారు. మళ్ళీ ఇన్నాళ్ళకు 'కల్కి 2898 AD' సినిమాతో నాగ్ అశ్విన్ మరోసారి అమితాబ్‌ స్థాయికి తగిన పాత్రలో చూపించారు. అశ్వద్ధామగా ప్రజెంట్ చేసి ప్రశంసలు అందుకుంటున్నారు. మరి ఇప్పటి నుంచైనా బాలీవుడ్ దర్శకులు బిగ్ బీ పొటెన్షియల్ కు తగ్గ క్యారెక్టర్స్ రాస్తారేమో చూడాలి.

Tags:    

Similar News