టాలీవుడ్ లో లవ్ స్టోరీల ట్రెండ్..!

ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకుంటున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త కథలు.. కొత్త కొత్త ప్రయత్నాలతో దర్శక నిర్మాతలు అలరిస్తున్నాయి

Update: 2023-08-17 07:36 GMT

ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకుంటున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త కథలు.. కొత్త కొత్త ప్రయత్నాలతో దర్శక నిర్మాతలు అలరిస్తున్నాయి. తెలుగు సినిమా స్టామినా ఇది అని ప్రూవ్ చేస్తూ చాలా సినిమాలు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ లో సక్సెస్ అందుకుంటున్నాయి. అయితే ఎంత గొప్ప కథలు వచ్చినా సరే తెలుగు సినిమాల్లో ప్రేమ కథలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. కమర్షియల్ సినిమాల లెక్క ఎలా ఉన్నా లవ్ స్టోరీస్ కి టాలీవుడ్ ఆడియన్స్ ఎప్పుడు ఆదరిస్తుంటారు.

మంచి ప్రేమ కథని తెరకెక్కిస్తే ఆ సినిమాను పక్కా హిట్ చేస్తారు. ఈ మధ్య కాలంలో మళ్లీ తెలుగు సినిమాల్లో లవ్ స్టోరీస్ బాగా వస్తున్నాయి. రాబోయే సినిమాల్లో కూడా ప్రేమకథలు ఉంటున్నాయని తెలుస్తుంది. వాటిలో మొదటగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపుడి డైరెక్షన్ లో ప్లాన్ చేస్తున్న సినిమా పీరియాడికల్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. ఈ సినిమా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తుంది. ఆల్రెడీ సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హను మరోసారి వెరైటీ లవ్ స్టోరీతో వస్తున్నాడు.

విజయ్ దేవరకొండ సమంత లీడ్ రోల్ లో వస్తున్న ఖుషి సినిమా కూడా లవ్ స్టోరీనే అని తెలిసిందే. అయితే శివ నిర్వాణ పెళ్లి తర్వాత ప్రేమను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాడని తెలుస్తుంది. ఖుషి సినిమా తెలుగులో రాబోతున్న మరో లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. ఇక డీజే టిల్లు సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ సినిమాలో కూడా లవ్ స్టోరీనే ప్రధాన అంశమని తెలుస్తుంది. ఈ సినిమాలో అనుపమని హీరోయిన్ గా తీసుకున్న కారణం అదే అని అంటున్నారు. టిల్లు స్క్వేర్ నుంచి వచ్చిన సాంగ్ ఇప్పటికే సూపర్ హిట్ కాగా డీజే టిల్లు కన్నా టిల్లు స్క్వేర్ డబుల్ హిట్ కొట్టాలని చూస్తున్నారు మేకర్స్.

నాగ చైతన్య చందు మొండేటి కాంబోలో వస్తున్న సినిమా కూడా అద్భుతమైన ప్రేమ కథతో వస్తుందని తెలుస్తుంది. శ్రీకాకులం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాలో లవ్ స్టోరీ హృదయానికి హత్తుకునేలా ఉంటుందని తెలుస్తుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. 2018లో వేటకి వెళ్లి కోస్ట్ గార్డ్ కి చిక్కిన 21 మంది భారతీయులలో ఒక వ్యక్తి కథగా ఈ సినిమా వస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో కథ తో పాటుగా లవ్ స్టోరీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని టాక్.

ఇలా మెయిన్ ఫ్లాట్ గా లవ్ స్టోరీస్ చేయడంతో పాటుగా తాము ఎంచుకున్న కథలో ప్రేమకథలను కూడా చేర్చి ఆడియన్స్ ని అలరించేలా చేస్తున్నారు దర్శకులు. తెలుగులో ఎవర్ గ్రీన్ హిట్ ఫార్ములా అయిన లవ్ స్టోరీస్ కి ఎప్పుడు డిమాండ్ తగ్గదని చెప్పొచ్చు. మరి రాబోతున్న ఈ ప్రేమకథా చిత్రాలు ఏమేరకు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయో చూడాలి.

Tags:    

Similar News