రహస్యంగా పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ బ్యూటీ
ఇటీవలే తనకు ఎంగేజ్మెంట్ జరిగిందని వెల్లడించింది. అలాగే తనకు కాబోయే భర్త వేలిని పట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన నిశ్చితార్థం జరిగిందని పేర్కొంది.
కుమార్ వర్సెస్ కుమారి అంటూ 2005లో తెలుగు సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేసిన టాలీవుడ్ హీరోయిన్ సునయన పెళ్లికి రెడీ అయింది. తెలుగులో పలు చిత్రాలతో ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది. తెలుగులో హీరో శ్రీవిష్ణు సరసన రాజా రాజా చోరా చిత్రంలో నటించింది. కానీ ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ కు వెళ్లి బిజీ అయిపోయింది. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది.
అయితే గత కొన్ని రోజులుగా ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఓ వార్త సినిమా వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ భామ ప్రేమలో పడిందని, ఇప్పటికే నిశ్చితార్థం కూడా చేసుకుందని, త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందన్నది ఈ ప్రచారం. ఈ వార్తలపై స్పందిస్తూ న్యూస్ నిజమేనంటూ క్లారిటీ ఇచ్చింది. ఇటీవలే తనకు ఎంగేజ్మెంట్ జరిగిందని వెల్లడించింది. అలాగే తనకు కాబోయే భర్త వేలిని పట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన నిశ్చితార్థం జరిగిందని పేర్కొంది. అలాగే తనకు అభినందనలు చెప్పే ప్రతి ఒక్కరికీ ముందుగానే కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేసింది.
2005లో కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో ఎంటరైనా కానీ 2008లో విడుదలైన కాదలిల్ విడుదెన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో పెళ్లికి ముందు ప్రేమకథ, రాజా రాజ చోర, చంద్రగ్రహణం, మీట్ క్యూట్ సిరీస్ లలో నటించింది. మళయాళంలో బెస్ట్ ఫ్రెండ్స్, కన్నడలో గ్యాంగ్ బారే .. తురే బారే చిత్రాలలో నటించింది.