టాలీవుడ్ నుంచి అర‌డ‌జ‌ను హీరోల‌కు ఆకాశ‌మే హ‌ద్దు!

అంటే ఇప్పుడు న‌లుగురు టాలీవుడ్ అగ్ర హీరోలు పెద్ద స్థాయి మార్కెట్ ని శాసించే స‌త్తా ఉన్న‌వారిగా ఎదిగారు. అంటే టాలీవుడ్ బ‌లం ఆ మేర‌కు పెరిగింద‌ని చెప్పాలి.

Update: 2023-08-25 05:21 GMT

కొన్ని లాజిక్ లపై ఆరా తీస్తే చాలా ఆస‌క్తిని క‌లిగిస్తాయి. బ్యాక్ టు బ్యాక్ మ‌న తెలుగు హీరోల‌కు జాతీయ అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు ద‌క్క‌డం నిజంగా ప్ర‌శంసించ‌ద‌గిన ప‌రిణామం. ఆస్కార్ అవార్డులు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు.. హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డులు .. ఈ మూడు చోట్లా రామ్ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ పేర్లు మార్మోగాయి. ప‌ర్య‌వ‌సానంగా ఆ ఇద్ద‌రినీ ఇప్పుడు అంత‌ర్జాతీయ స్థాయిలో ప్ర‌జ‌లు సులువుగా గుర్తిస్తారు. దేశీయ మార్కెట్ల‌లో వారి పేర్లు ఇప్ప‌టికే మార్మోగుతున్నాయి. ఇక‌పై వారు న‌టించిన సినిమాల‌కు జాతీయ అంత‌ర్జాతీయ స్థాయిలో ఆద‌ర‌ణ పెరుగుతుంది. ప‌ర్య‌వ‌సానంగా టాలీవుడ్ మార్కెట్ అమాంతం ప‌దింత‌ల‌వుతుంది. హాలీవుడ్ స్థాయిలో టాలీవుడ్ సినిమా విడుద‌ల అనే అంకానికి ఇది తొలి మెట్టు.

అయితే ఇప్పుడు టాలీవుడ్ నుంచి కేవ‌లం రామ్ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ (ఆర్.ఆర్.ఆర్ స్టార్లు) మాత్ర‌మే కాదు.. ప్ర‌భాస్ ఏనాడో పాన్ ఇండియా లేదా పాన్ వ‌రల్డ్ స్టార్ డ‌మ్ ని త‌న హార్డ్ వ‌ర్క్ తో సాధించుకున్నాడు. బాహుబ‌లి- బాహుబ‌లి 2- సాహో చిత్రాల‌తో ప్ర‌భాస్ స్థాయి అమాంతం పెరిగింది. ఇత‌రుల కంటే ఒక మెట్టు పైనే ఉన్నాడు ప్ర‌భాస్. ఇప్పుడు స‌లార్ - ప్రాజెక్ట్ కే చిత్రాల‌తో అది రెట్టింపు కానుంది.

ఇంట్రెస్టింగ్ గా అల్లు అర్జున్ రేసులోకొచ్చాడు. అత‌డికి తెలుగు -త‌మిళం-మ‌ల‌యాళంలో చాలా గొప్ప పేరుంది. పైగా జాతీయ అవార్డ్ సాధించాడు. చాలా కోణాల్లో ప‌రిశీలిస్తే ఇది చాలా అత్యావ‌శ్య‌కమైన ద‌శ‌ అని తెలుగు సినిమా క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చ‌ర‌ణ్ - ఎన్టీఆర్- ప్ర‌భాస్ ల‌తో పాటు బ‌న్ని పేరు కూడా పాన్ వ‌ర‌ల్డ్ లో మార్మోగుతుంది. అత‌డి మార్కెట్ రేంజ్ కూడా ఇత‌రుల‌కు ధీటుగా పెరుగుతుంది. అంటే ఇప్పుడు న‌లుగురు టాలీవుడ్ అగ్ర హీరోలు పెద్ద స్థాయి మార్కెట్ ని శాసించే స‌త్తా ఉన్న‌వారిగా ఎదిగారు. అంటే టాలీవుడ్ బ‌లం ఆ మేర‌కు పెరిగింద‌ని చెప్పాలి.

మునుముందు మ‌హేష్ - ప‌వ‌న్ స‌హా ఇత‌ర స్టార్లు కూడా రేసులో దూసుకెళ్లేందుకు మార్గం సుగ‌మం అయింది. టాలీవుడ్ నుంచి డ‌జ‌ను మంది హీరోలు జాతీయ అంత‌ర్జాతీయ స్థాయి మార్కెట్ల‌లో సంచ‌ల‌నంగా మారితే ఆ మేర‌కు వారి ఎంపిక‌లు యూనివ‌ర్శ‌ల్ గా మార‌తాయి. అంటే తెలుగు సినిమా స్థాయి ఇంచుమించు హాలీవుడ్ ని ఢీకొట్టే స్థాయికి ఎదుగుతుంద‌న్న ఆశ ఏర్ప‌డుతుంది. ఇక భారీ సినిమాల నిర్మాణం విష‌యంలో అస‌లు దిగులే లేదు. అంత పెద్ద పెట్టుబ‌డుల‌ను తెచ్చేది ఎలా? అంటే.. ఇటీవ‌లి ఫైనాన్స్ విధానంలో దానికి భ‌రోసా ఉంది. అంత‌ర్జాతీయ దిగ్గ‌జ సంస్థ‌ల‌తో టై అప్ విధానంలో సులువుగా ఆర్థిక వ‌న‌రుల్ని స‌మీక‌రించే వీలుంది. మ‌న స్టార్లు భారీ సినిమాల‌తో పెద్ద స్థాయి ప్ర‌య‌త్నాల‌కు ఉసిగొలిపే అరుదైన త‌రుణమిది. జాతీయ అంత‌ర్జాతీయ గుర్తింపుతో చాలా మెరుగైన సినిమాలు టాలీవుడ్ నుంచి పుట్టుకొస్తాయ‌న‌డంలో సందేహం లేదు. యూనివ‌ర్శ‌ల్ కాన్సెప్టులు తీయాలి అని భావించే ఫిలింమేక‌ర్స్ ఇప్పుడు కోకొల్ల‌లుగా పుట్టుకు రావ‌డానికి కార‌ణం తెరుచుకున్న కొత్త‌దారులేన‌న‌డంలో సందేహం లేదు.

Tags:    

Similar News