టాలీవుడ్ స్టార్స్ ఓటీటీ వైపు వెళ్లేదెప్పుడు?

కొంత మంది నేరుగా కొన్ని కార్పోరేట్ కంపెనీల‌తో ఒప్పందం చేసుకుని భాగ‌స్వామిగానూ కొనసాగుతున్నారు.

Update: 2024-04-06 14:30 GMT

నేడు ఓటీటీ వ‌ర‌ల్డ్ ని ఏ రేంజ్ లో ఏల్తుందో క‌ళ్ల ముందు క‌నిపిస్తుంది. సినిమా ..సీరియ‌ల్..డాక్యుమెంట‌రీ...వెబ్ సిరీస్ ఇలా ఏది రిలీజ్ చేసినా అనేక భాష‌ల్లోకి వెళ్లేది కేవ‌లం ఓటీటీతో మాత్ర‌మే సాధ్యం. అందుకే భ‌విష్య‌త్ ఓటీటీదే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇది గ‌మ‌నించిన మేధావులు...సాంకేతిక ప‌రిజ్ఞానం ఉన్న‌వాళ్లు ఇప్ప‌టికే ఆ మార్కెట్ లోకి ఎంట‌ర్ అయిపోయారు. బాలీవుడ్ స్టార్ హీరోలు..హీరోయిన్లు సైతం ఓటీటీలో ప‌ని చేస్తున్నారు. అక్క‌డ వెబ్ సిరీస్ లు చేసి ఓటీటీ మార్కెట్ ని బిల్డ్ చేసుకుంటున్నారు.

కొంత మంది నేరుగా కొన్ని కార్పోరేట్ కంపెనీల‌తో ఒప్పందం చేసుకుని భాగ‌స్వామిగానూ కొనసాగుతున్నారు. డైరెక్ట్ టూ హోమ్ రిలీజ్ అనేది ఓటీటీ ద్వారా దాదాపు సాధ్య‌మ‌ని తేలిపోయింది. ఈ టెక్నాల‌జీని తీసుకురావాల‌ని ఓటీటీ రాక‌ముందే డీటీ హెచ్ తో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకెళ్లాల‌ని క‌మ‌ల్ హాసన్ ఎంతో ప్ర‌య‌త్నించారు. కానీ ప‌న‌వ్వ‌లేదు. త‌ర్వాత కాలంలో ఎన్నో మార్పుల‌తో ఓటీటీ అందుబాటులోకి వ‌చ్చింది. మ‌రి టాలీవుడ్ లో ఓటీటీ ప్ర‌భావం ఎలా ఉంది అంటే చాలా వీక్ గానే క‌నిపిస్తుంది.

ఇక్క‌డ నుంచి కేవ‌లం ముగ్గురు పేరున్న హీరోలు మాత్ర‌మే ఓటీటీకి ఎంట్రీ ఇచ్చారు. `రానా నాయుడు` వెబ్ సిర‌స్ వెంక‌టేష్‌..రానా లాంచ్ అయ్యారు. `దూత` వెబ్ సిరీస్ తో నాగ‌చైత‌న్య ప్ర‌వేశంచారు. ప్ర‌స్తుతం `దూత‌-2`కి రెడీ అవుతున్నాడు. వీళ్ల ముగ్గురి వెనుక కీల‌క పాత్ర పోషించింది సురేష్ బాబు. టెక్నిక‌ల్ గా సురేష్ బాబు ఎంతో అడ్వాన్స్ గా ఆలోచించ‌గ‌ల‌రు. అంత‌టి సామ‌ర్ధ్యం ఆయ‌న సొంతం.

అందుకే టాలీవుడ్ నుంచి ద‌గ్గుబాటి ఫ్యామిలీ హీరోలు ముందుగా ఎంట్రీ ఇవ్వ‌గ‌లిగారు. మిగ‌తా స్టార్ హీరోలెవ‌రి నోట ఓటీటీ మాటే రాలేదు. చిరంజీవి.. మ‌హేష్‌..రామ్ చ‌ర‌ణ్‌...ఎన్టీఆర్...బ‌న్నీ..ప్ర‌భాస్..నాగార్జున‌..బాల‌కృష్ణ ఇలా ఎంతో మంది స్టార్ హీరోలున్నారు. కానీ వాళ్లెవ్వ‌రూ ఓటీటీ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు క‌నిపించ‌లేదు. ఇంకా టైర్ -2 హీరోలు నాని..రామ్..నితిన్..నిఖిల్ స‌హా చాలా మంది ఉన్నారు. వీరంతా థియేట‌ర్ రిలీజ్ కి ఇచ్చిన ప్రాధాన్య‌త ఓటీటీకి ఇవ్వ‌డం లేదు. మ‌రి ఆ ఛాన్స్ ఎప్పుడు తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News