ఏపి తెలంగాణ.. ఫస్ట్ డే అత్యధిక షేర్ తెచ్చిన సినిమాలు
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ మార్కెట్
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ మార్కెట్ వాల్యూ రోజు రోజుకు అమాంతంగా పెరిగిపోతుంది. మొదటి రోజే మన హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బ్రేక్ అవుతాయని కూడా అర్థమవుతుంది. ఇక రీసెంట్ గా వచ్చిన ఆదిపురుష్ వరకు చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక స్థాయిలో మొదటి రోజు ఓపెనింగ్స్ అందుకున్న సినిమాలు ఈ విధంగా ఉన్నాయి.
ముందుగా రాజమౌళి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ 'RRR' సినిమా మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొదటి రోజు ఈ సినిమా 74 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక రెండవ స్థానంలో ఉన్న 'బాహుబలి సెకండ్ పార్ట్' అయితే అప్పట్లో 43 కోట్లు అందుకొని అప్పటివరకు ఉన్న పాత రికార్డులను బ్రేక్ చేసింది. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' ఏపీ నైజంలో రికార్డులు బ్లాస్ట్ అయ్యేలా ఫస్ట్ డే 38.5 కోట్ల గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకోవడం విశేషం.
ఇక ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు అయితే ఏకంగా 36.52 కోట్లను సాధించింది. ఆ తర్వాత టాక్ డివైడ్ గా వచ్చినప్పటికీ సినిమా నష్టాలు అయితే పెద్దగా తీసుకురాలేదు.
ఇక మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమా ద్వారా మొదటిసారి టాప్ రికార్డుల లిస్టులో చేరాడు. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఏపీ తెలంగాణలో మొదటి రోజు 36 కోట్ల కలెక్షన్స్ అందుకోవడం విశేషం.
ఇక ఇటీవల వచ్చిన 'ఆదిపురుష్' సినిమాతో మరోసారి ప్రభాస్ ఈ టాప్ లిస్టులో చేరిపోయాడు. ఆదిపురుష్ సినిమాకు మొదటి నుంచి కొంత నెగిటివ్ టాక్ ఉన్నప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఊహించిన విధంగా 32.84 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో మహేష్ బాబు ఏకంగా మొదటి రోజు 32 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు.
ఇక ఈ లిస్టులో 8వ స్థానంలో ఉన్న 'వకీల్ సాబ్' సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ 32 కోట్ల షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాకు కొన్ని ఏరియాలలో నష్టం వచ్చినప్పటికీ మాత్రం ఓపెనిగ్స్ ద్వారానే ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. ఇక 10వ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ 'అరవింద సమేత' కొనసాగుతోంది. ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 26.64 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుంది.