ఇండ‌స్ట్రీకొచ్చే వాళ్లు ఆ నలుగుర్ని స్పూర్తిగా తీసుకోవాలి!

బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీకొచ్చే వారు రాణించాలంటే? ముందుగా కృషి..ప‌ట్టుద‌ల‌..సాధించాల‌నే త‌ప‌న ఉండాలి

Update: 2024-06-06 15:30 GMT

బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీకొచ్చే వారు రాణించాలంటే? ముందుగా కృషి..ప‌ట్టుద‌ల‌..సాధించాల‌నే త‌ప‌న ఉండాలి. వీటితో పాటు అదృష్టం కూడా క‌లిసి రావాలి. లేక‌పోతే ఎంత ట్యాలెంట్ ఉన్నా అవ‌కాశాలు రాక ఫిలిం న‌గ‌ర్ చుట్టూ తిరిగే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అందుకే ఇక్క‌డ ల‌క్ అనే ప్యాక్ట‌ర్ కూడా కీల‌కమ‌నే చెప్పాలి. స‌క్సెస్ అయిన ప్ర‌తీ ఒక్క‌రు ల‌క్ కూడా క‌లిసి రావాల‌ని చెప్పిన వారెంతో మంది. తాజాగా ఇండ‌స్ట్రీలో రాణించాల‌నుకునే వారికి సీనియ‌ర్ డైరెక్ట‌ర్ వంశీ ఓ ముగ్గురు వ్య‌క్తుల్ని ఉద‌హ‌రించి..వాళ్ల‌ని స్పూర్తిగా తీసుకోమ‌న్నారు.

అదేంటో ఆయ‌న మాట‌ల్లోనే.. `సినిమా బాగా రావాలి అంటే ఏం చేయాలని నన్ను చాలామంది అడిగారు. నేను చాలా గొప్ప దర్శకుల బుక్స్ చదివాను. వాళ్లంతా కూడా చెప్పిందే ఒక్కటే. మంచి సినిమా తీయాలంటే పెర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఉండాలి. సరిచేయవలసిన అవసరం లేని స్క్రిప్ట్ చేతిలో ఉంటే సగం సక్సెస్ అక్కడే వచ్చేస్తుంది. అందువలన కొత్తగా వచ్చే దర్శకులకు నేను ఇదేమాట చెబుతాను. ఇండస్ట్రీకి రావాలనుకునేవారు ఒక నలుగురిని స్ఫూర్తిగా తీసుకోవాలి.

బాపు గారు, బాలూగారు, చిరంజీవి గారు , ఇళయరాజాగారు. వీళ్ల నలుగురూ కూడా నిద్రపోయేటప్పుడు తప్ప నిరంతరం తాము చేయవలసిన పనిని గురించే ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకే ఆ స్థాయికి చేరుకోగలిగారు. ఇళయరాజా గారు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి సాధన చేస్తారు. ఇప్పటికీ అంతే . అందువల్లనే ప్రపంచ సంగీతం ఆయన వెంట పరుగులు తీస్తోంది` అని అన్నారు.

ఎన్ని త‌రాల‌కైనా ఈ నులుగురు గొప్ప స్పూర్తి ప్ర‌ధాత‌లు. వాళ్ల ప‌డిన క‌ష్ట‌మే ఆ స్థాయికి తీసుకొచ్చింది. స‌క్సెస్ అవ్వాల‌ని చాలా మంది అనుకుంటారు. కానీ ఆ స‌క్సెస్ ని చూసేది కొంద‌రే. చిరంజీవి త‌ర్వాత ర‌వితేజ‌, నాని లాంటి వారు కూడా అలా స‌క్సెస్ అయిన వారే. బాపు వ‌ద్ద నేచుర‌ల్ స్టార్ నాని కూడా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే. నాని కెరీర్ లోనే అదో అనుభూతి..అనుభ‌వం. ఎవ‌రికీ రాని అవ‌కాశం నానికి ఆ రూపంలో ద‌క్కింది.

Tags:    

Similar News