అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులా మ‌ళ్లీ మ‌ళ్లీ!

టాలీవుడ్ లో రీ-రిలీజ్ ల ట్రెండ్ కొంత కాలంగా అమ‌లులో ఉన్న సంగ‌తి తెలిసిందే

Update: 2024-02-24 10:40 GMT

టాలీవుడ్ లో రీ-రిలీజ్ ల ట్రెండ్ కొంత కాలంగా అమ‌లులో ఉన్న సంగ‌తి తెలిసిందే. స్టార్ హీరోల చిత్రాలు పుట్టిన రోజు సంద‌ర్భంగానో..మ‌రో ఆకేష‌న్ గానో హిట్ చిత్రాల్ని రిలీజ్ చేసి అభిమానుల్ని మ‌ళ్లీ ఆ పాత రోజుల్లోకి తీసుకెళ్తున్నారు. -రీ-రిలీజ్ రూపంలోనూ అవి బాగానే వ‌సూళ్లు రాబ‌డుతున్నాయి. అభిమానుల కోసం రెండు రోజులు ఆడించినా ఎంతో కొంత లాభం క‌నిపిస్తుంది. అయితే ఇప్పుడు ఆ లాభాలు చూసిన యాజ‌మాన్యాలు రీ-రీ-రిలీజ్ లు చేయ‌డం కొత్త‌గా ప్రారంభించారు.

అంటే ఇప్ప‌టికే రీ -రిలీజ్ అయిన సినిమాని మ‌ళ్లీ మూడ‌వ సారి రిలీజ్ చేయ‌డం అన్న‌మాట‌. స‌రైన కొత్త సినిమాలు కూడా లేక‌పోవ‌డంతో ఎగ్జిబిట‌ర్లు రిలీజ్ అయిన చిత్రాల్నే మ‌ళ్లీ మ‌ళ్లీ రిలీజ్ చేస్తున్నారు. ఈ స‌న్నివేశం చూస్తుంటే అరిగిపోయిన గ్రాప్ పోన్ రికార్డులాగే క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించిన 'ఒక్క‌డు' రెండు సార్లు రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఫిబ్ర‌వ‌రి 23 న కూడా మ‌ళ్లీ రిలీజ్ అయింది.

అలాగే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన 'సింహాద్రి' మార్చి 1న రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టికే ఈ సినిమా రెండు సార్లు రిలీజ్ అయింది. ఇక న‌ట‌సింహ బాల‌కృష్ణ న‌టించిన 'స‌మ‌ర‌సింహారెడ్డి' 25 ఏళ్లు పూర్తిచే సుకున్న సంద‌ర్భంగా రెండ‌సారి రిలీజ్ చేస్తున్నారు. ఈసినిమా అప్ప‌ట్లో ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. సీమ ఫ్యాక్ష‌నిజాన్ని ప‌రిచ‌యం చేసిన చిత్ర‌మిది. ఇది రీ-రిలీజ్ కోటాలో రావ‌డంతో అభిమానులంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

అలాగే మాస్ రాజా ర‌వితేజ న‌టించిన వెంకీ రీ-రిలీజ్ కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో మార్చి 1న 'కిక్' ని రిలీజ్ చేస్తున్నారు. ఇంకా మూడ‌వ సారి రిలీజ్ అవ్వ‌డానికి 'ఇంద్ర‌'..'శివ' సహ మ‌రికొన్ని గోల్డెన్ హిట్స్ క్యూలో ఉన్న‌ట్లు స‌మాచారం. 'ఇంద్ర‌'..'శివ' ఇప్ప‌టికే రీ-రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News