బాక్సాఫీస్.. ఒక్కటి పేలలేదే..
దీపావళి సందర్భంగా టాలీవుడ్ నుంచి అయితే చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కాలేదు.
దీపావళి సందర్భంగా టాలీవుడ్ నుంచి అయితే చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కాలేదు. అలా నిన్ను చేరి అనే చిన్న మూవీ ఒకటి రిలీజ్ అయిన పెద్దగా టాక్ రాలేదు. హెబ్బా పటేల్ సినిమాలో ఉన్నా కూడా ఆడియన్స్ కి మాత్రం మూవీ కనెక్ట్ కాలేదు. ఇక తమిళంలో కార్తి హీరోగా తెరకెక్కిన జపాన్, లారెన్స్, ఎస్.జె సూర్య కాంబోలో వచ్చిన జిగార్తాండ డబుల్ ఎక్స్ సినిమాలు దీపావళి సందర్భంగా రిలీజ్ అయ్యాయి.
అయితే ఈ రెండు సినిమాలు కంటెంట్ అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ఆడియన్స్ కి డిస్కనెక్ట్ అయ్యాయి. జపాన్ సినిమాలో కార్తి లాంటి స్టార్ యాక్టర్ ఉండటంతో ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కథ, కథనంతో దర్శకుడు ప్రేక్షకులని మెప్పించాలేకపోయాడు. ఇక స్టార్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు కూడా జిగార్తాండ డబుల్ ఎక్స్ సినిమాతో పెద్దగా ఆకట్టుకులేకపోయాడు.
జిగార్తాండ మూవీతో పోల్చి చూసిన వారికి ఈ డబుల్ ఎక్స్ షాక్ కొట్టింది. కోలీవుడ్ లో కూడా ఈ సినిమాలు థియేటర్స్ లో పెద్ద ప్రభావం చూపించలేకపోయాయి. దీంతో దీపావళికి డబ్బింగ్ టపాసుల సందడి తుస్సుమన్నట్లే అయిపొయింది. హిందీ నుంచి సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ సిరీస్ లో భాగంగా టైగర్ 3 మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకి ఒక వర్గం నుంచి పాజిటివ్ టాక్ లభిస్తోంది.
కొంతమంది స్టొరీ రెగ్యులర్ గా ఉందనే కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఈ సినిమా షోలు పడిపోయాయి. పాన్ ఇండియా రేంజ్ లోనే టైగర్ 3 మూవీ రిలీజ్ అవుతోంది. పఠాన్ తరహాలో సౌత్ లో కూడా ఈ టైగర్3 మూవీ ప్రభావం చూపిస్తుందేమో అనేది చూడాలి.
ఒకవేళ చూపిస్తే మాత్రం యష్ రాజ్ ఫిలిమ్స్ ఖాతాలో పఠాన్ తర్వాత మరో వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాదించే సినిమాగా టైగర్ 3 నిలిచిపోతుంది. అలాగే సల్మాన్ ఖాన్ ఖాతాలో వెయ్యి కోట్ల కలెక్షన్స్ అందుకున్న మొదటి చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేయనుంది. మరి ఇది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది వేచి చూడాలి.