సంక్రాంతి బాక్సాఫీస్.. మరింత హీటెక్కేలా..

సూపర్ స్టార్ రజనీకాంత్ రీసెంట్​గా 'జైలర్'తో భారీ బ్లాక్ బాస్టర్​ను అందుకున్న సంగతి తెలిసిందే.

Update: 2023-10-02 03:15 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ రీసెంట్​గా 'జైలర్'తో భారీ బ్లాక్ బాస్టర్​ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం దాదాపు రూ.600 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అయితే ఆ సక్సెస్​ను ఇంకా మర్చిపోనేలేదు.. అంతలోనే రజనీకాంత్ నటించిన మరో కొత్త సినిమా రిలీజ్​కు రెడీ అయింది. వచ్చే సంక్రాంతి బరిలో దిగబోతుంది.

ఇంతకీ ఆ చిత్రం ఏంటంటే.. రజనీకాంత్ గెస్ట్​ రోల్​లో మొయిద్దీన్ భాయ్​గా నటించిన 'లాల్ సలాం'. ఈ చిత్రానికి రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకురాలు. చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ హీరోలుగా నటించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తోంది.

అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ.. ఒక్కసారి సంక్రాంతి బరిలోకి దిగే సినిమాలను లిస్ట్​ చూస్తే బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా ఉండనుందని అర్థమవుతోంది. రోజురోజుకు ఈ ముగ్గుల పండక్కు రాబోయే చిత్రాలు జాబితా పెరుగుతూ వస్తోంది. తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం ఇప్పటికే ఆ పండక్కు డేట్ లాక్ చేసుకుంది. ఇటీవలే విజయ్ దేవరకొండ - పరశురామ్​ చిత్రం, తేజ సజ్జా హనుమాన్​ కూడా ఈ పతాకాల పండక్కే రానున్నట్లు అనౌన్స్ చేశారు. నాగార్జున నా సామిరంగ కూడా సంక్రాంతికే కన్ఫామ్ చేసుకుంది.

సలార్ దెబ్బతో క్రిస్మస్​కు రావాల్సిన వెంకీ సైంధవ్ కూడా సంక్రాంతికే రానుందని తెలుస్తోంది. రవితేజ పాన్ ఇండియా ఈగల్​ కూడా సంక్రాంతి బరిలోనే దిగనుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే.. కోలీవుడ్​ నుంచి సంక్రాంతికి రానున్న డబ్బింగ్ చిత్రాల లిస్ట్​ కూడా పెరుగుతోంది. ఇప్పటికే హీరో శివకార్తికేయన్ నటించిన అయలాన్ పతకాల పండక్కే ఖరారైంది. సుందర్​ సి తెరకెక్కించిన హారర్​ కామెడీ అరణ్మయి 4 కూడా పొంగల్ పండక్కే రానంది.

ఇవన్నీ చూస్తుంటే.. తెలుగు చిత్రాలకే థియేటర్లు దొరకడం కష్టమనుకుంటే.. మరి ఇన్ని డబ్బింగ్ చిత్రాల కోసం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు థియేటర్లు దొరకడం పెద్ద సవాల్​ అనే చెప్పాలి. ఇన్ని ఒకేసారి రిలీజ్ కానుండటం కూడా బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రభావం చూపుతుంది. చూడాలి మరి ఏం ఇంకా మూడు నెలలు సమయం ఉన్నందున్న ఏమైనా చిత్రాలు వెనక్కి తగ్గుతాయో లేదో..

Tags:    

Similar News