నయా స్టార్ డైరెక్టర్లు నలుగురు డేంజర్ జోన్ లో!
ఇండస్ట్రీ వాతావరణం ఇంతకు మునుపులా లేని సంగతి తెలిసిందే. ఎలాంటి డైరెక్టర్ అయినా హిట్ ఇవ్వా ల్సిందే
ఇండస్ట్రీ వాతావరణం ఇంతకు మునుపులా లేని సంగతి తెలిసిందే. ఎలాంటి డైరెక్టర్ అయినా హిట్ ఇవ్వా ల్సిందే. హిట్ ఇచ్చిన అగ్ర దర్శకులకే హీరోలు డేట్లు కేటాయించలేని పరిస్థితులున్నాయి. అలాంటిది హిట్ లేని స్టార్ డైరెక్టర్ల పరిస్థితి ఎలా ఉంటుంది? అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోలిప్పుడు గత రికార్డులు చూసి ఛాన్సులు ఇవ్వడం లేదు. ట్రెండింగ్ లో ఉన్నాడా? మనతో సినిమా చేసే ముందు అతడి సినిమా ఎన్ని కోట్లు తెచ్చింది? ఇలా కొన్ని కొలమానాలతో అవకాశం ఇస్తున్నారు.
ఇవన్నీ విశ్లేషించి చూస్తే ఈ నయా డైరెక్టర్లు కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్లే కనిపిస్తుంది. పైప్ లైన్ లో ఉన్న చిత్రాలతో కచ్చితంగా హిట్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నట్లే కనిపిస్తుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ తో 'గేమ్ ఛేంజర్' తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ లో అవకాశం రాకపోవడంతో టాలీవుడ్ కి వచ్చి సినిమా చేస్తున్నాడు? అన్న ఆరోపణ కూడా తెరపైకి వచ్చింది. 'రోబో' తర్వాత ఆ రేంజ్ హిట్ శంకర్ కి లేదు. 'ఐ 'ప్లాప్ అవ్వగా..'2.0' నష్టాలు లేకుండా బయటపడింది.
దీంతో శంకర్ మార్కెట్ ఒక్కసారిగా డౌన్ అయిన సన్నివేశం కనిపించింది. ఈ నేపథ్యంలో అతడిపై కోలీవుడ్ లో రకరకాల రూమార్లు తెరపైకి వచ్చాయి. అలాగే ఆచార్య వరకూ తిరుగులేని స్టార్ మేకర్ అనిపిం చుకున్న కొరటాల శివ జర్నీ గురించి తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోయిన కొరటాలకి ఆచార్య ప్లాప్ బ్రేక్ వేసింది. అదీ మెగాస్టార్ ని పెట్టుకుని మరీ ప్లాప్ ఇవ్వడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కున్నాడు. అయినా అతడిపై నమ్మకంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇడియా చిత్రం దేవర చేసే అవకాశం కల్పిం చారు.
ఇక క్రియేటవ్ డైరెక్టర్ క్రిష్ గౌతమీపుత్రశాతకర్ణి తర్వాత విజయం అందని ద్రాక్షలా మారింది. ఆ తర్వాత చేసిన ఏ సినిమా ఆశించిన ఫలితాలు సాధించలేదు. అయినా క్రిష్ ప్రతిభని నమ్మి పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' తో అవకాశం కల్పించాడు. ఈ ప్రాజెక్ట్ డిలే అవ్వడంతో కొత్త ప్రాజెక్ట్ ని పట్టాలెక్కి స్తున్నారు. ఇక సాహో పరాజయం తర్వాత యంగ్ డైరెక్టర్ సుజిత్ నాలుగేళ్లు ఖాళీగా ఉన్నాడు. చివరికి ఎలాగో పవన్ కళ్యాన్ 'ఓజీ'తో లాక్ చేసి పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే.
డిలే అవుతున్న సుజిత్ మాత్రం అదే ప్రాజెక్ట్ పై ఫోకస్ట్ గా పనిచేస్తున్నాడు. అలాగే డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డబుల్ ఇస్మార్ట్ పై ఎంత ఎఫెర్ట్ పెట్టి చేస్తున్నాడో తెలిసిందే. రెండు నెలల్లోనూ షూటింగ్ చుట్టేసే పూరి ఈ సినిమా కోసం నెలలు తరబడి కేటాయించి సెట్స్ లోనే పనిచేస్తున్నారు. ఈ నలుగురు ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పకుండా విజయం అందుకోవాల్సిందే. లేదంటే హిట్ డైరెక్టర్ల రేసులో అంతకంతకు వెనుకబడే అవకాశం ఉంది.