టాలీవుడ్ రెండు పార్టుల గోల.. మరొకటి చేరింది!

బాహుబలి, కేజీఎఫ్ సిరీస్ లు సౌత్ నుంచి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.

Update: 2024-04-10 04:45 GMT

బాహుబలి, కేజీఎఫ్ సిరీస్ లు సౌత్ నుంచి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈ రెండు సినిమాల ఇంపాక్ట్ మిగిలిన ఇండస్ట్రీల మీద ఎలా ఉందో తెలియదు కానీ టాలీవుడ్ పైన మాత్రం గట్టిగానే ఉందని చెప్పాలి. ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ కూడా తమ సినిమాలని వందల కోట్ల బడ్జెట్ తో రెండు భాగాలుగా చేస్తున్నారు. దర్శకులు కూడా కథ రాసుకున్నప్పుడే రెండు పార్ట్స్ క్రింద స్టోరీని సిద్ధం చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.


కొంతమంది దర్శకులు మూవీ క్లైమాక్స్ లో సీక్వెల్ కి ఒక లీడ్ విడిచిపెడుతున్నారు. ఆ సినిమా సక్సెస్ అయితే సీక్వెల్ ప్లానింగ్ లోకి వెళ్తున్నారు. ఫెయిల్ అయితే సీక్వెల్ ఆలోచన పక్కన పెడుతున్నారు. బాహుబలి స్ఫూర్తితోనే కార్తికేయ సీక్వెల్ ని చందూ మొండేటి తీసుకొచ్చి సక్సెస్ కొట్టాడు. తాజాగా టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అఖండ సీక్వెల్ ప్లానింగ్ లో బోయపాటి శ్రీను ఉన్నాడు.

పుష్పకి సీక్వెల్ గా పుష్ప ది రూల్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. సలార్ కి సీక్వెల్ గా సలార్ 2కి రంగం సిద్ధం అవుతోంది. ఇవి కాకుండా ఇంకా మొదటి పార్ట్ రిలీజ్ కాకుండానే రెండు భాగాలుగా ఎనౌన్స్ అయిన సినిమాల సంగతి ఓ సారి చూసుకుంటే ఎన్టీఆర్ దేవర కనిపిస్తోంది. ఈ మూవీ షూటింగ్ జరుగుతూ ఉండగానే కొరటాల పార్ట్ 2 కూడా ఉంటుందని ఎనౌన్స్ చేశాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో చేస్తోన్న ఓజీ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోందని ముందుగానే చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ వచ్చింది. అలాగే క్రిష్ దర్శకత్వంలో సిద్ధం అవుతోన్న హరిహరవీరమల్లు రెండు భాగాలుగానే ఉండబోతోందంట. డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898ఏడీ కూడా రెండు భాగాలుగానే సిద్ధం అవుతోందని తెలుస్తోంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే సినిమా కూడా రెండు భాగాలుగానే ఉండబోతోందని వినికిడి.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కబోయే స్పిరిట్ మూవీ కూడా రెండు భాగాలుగానే ఉండొచ్చని టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఈ జాబితాలోకి యంగ్ హీరో అఖిల్ మూవీ కూడా చేరబోతోంది. యూవీ క్రియేషన్స్ లో అనిల్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ చేయబోయే ధీర మూవీ రెండు భాగాలుగా రెడీ చేయనున్నారంట. అనిల్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఒక అఫీషియల్ అప్డేట్ తో సినిమాను లాంచ్ చేయనున్నారు. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో ఫస్ట్ పార్ట్ తెరకెక్కున్నట్లు టాక్. మరి వీటిలో ఎన్ని బాహుబలి, కేజీఎఫ్ తరహాలో సంచలన రికార్డులు నమోదు చేస్తాయో చూడాలి.

Tags:    

Similar News