యంగ్ హీరోల థింకింగ్ సీరియస్ గానే!
స్టోరీలు వింటున్నా సెట్ అవ్వడం లేదు. అలాగని తొందర పడటం లేదు
'ఏజెంట్' ప్లాప్ తో అఖిల్..'ఆదికేశవ' పరాజయంతో వైష్ణవ్ తేజ్..'విరూపాక్ష' విజయంతో సాయితేజ్.. అలాగే 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సక్సెస్ తో నవీన్ పొలిశెట్టి డైలమాలో పడినట్లు తెలుస్తోంది. ఇంత వరకూ ఈ హీరోలెవరు తదుపరి ప్రాజెక్ట్ గురించి రివీల్ చేయని సంగతి తెలిసిందే. 'ఏజెంట్' పరాజ యంతో అఖిల్ ఏ దర్శకుడితో సినిమా చేయాలి? ఎలాంటి కంటెంట్ ఎంచుకోవాలి? అన్న దానిపై ఏడాది కాలంగా కిందా మీదా పడుతున్నాడు.
తొందరపడి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. అప్పటివరకూ సొంత నిర్ణయాలపై ముందుకెళ్లిన అఖిల్ ఏజెంట్ తర్వాత అలా తీసుకోవడం కరెక్టేనా? అని కాస్తీ సీరియస్ గానే ఆలోచిస్తు న్నాడు. అందుకే తదుపరి ప్రాజెక్ట్ విషయంలో కుటుంబ సభ్యుల్ని కూడా ఇన్వాల్వ్ చేసేలా ఆలోచన చేస్తున్నాడు. కథలు వింటు న్నా సంతృప్తి చెందడం లేదు. తనకి..తన కుటుంబాన్ని మెప్పించిన స్టోరీ ఇంతవరకూ కుదర్లేదు. అలాగేని అఖిల్ రెస్ట్ తీసుకోవడం లేదు. ఉన్న సమయాన్ని కొత్త సినిమా కోసమే కేటాయిస్తున్నాడు.
ఇక పంజా వైష్ణవ్ తేజ్ కూడా ఉప్పెనతో దూసుకొచ్చినా ఆ తర్వాత సరైన ఫలితాలు అందుకోవడంలో వెనుకబడ్డాడు. 'కొండ పొలం'.. 'రంగ రంగ వైభవంగా' రెండు కమర్శియల్ గా అంచానలు అందుకోలేదు. ఆ తర్వాత రిలీజ్ చేసిన 'ఆదికేశవ' కూడా వర్కౌట్ కాలేదు. దీంతో యంగ్ హీరో ఖాతాలో హ్యాట్రిక్ ప్లాప్ లు నమోదయ్యాయి. దీంతో ఇప్పుడు తీసుకునే నిర్ణయం..స్టోరీ సెలక్షన అన్నది కీలకంగా మారింది.
స్టోరీలు వింటున్నా సెట్ అవ్వడం లేదు. అలాగని తొందర పడటం లేదు. ఇంకొన్ని నెలలు ఈ సావాసం తప్పదనిపిస్తోంది. ఇక సాయితేజ్ కి బ్రో రూపంలో 'విరూపాక్ష' తర్వాత ప్లాప్ ఎదురైనా ఆ ప్రభావం పెద్దగా పడలేదు. విరూపాక్ష 100 కోట్ల వసూళ్లు తేవడంతో సాయితేజ్ మార్కెట్ అమాంతం రెట్టింపు అయింది. దీంతో 'బ్రో 'ప్లాప్ లెక్కలోకి రాలేదు. మార్కెట్ పై ప్రభావం చూపలేదు. ఇప్పుడా క్రేజ్ ని అలాగే కొనసాగిం చాలి అంటే హిట్ కంటెంట్ అంతే కీలకం.
అందుకే 'గాంజా శంకర్' విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తున్నాడు. అలాగే నవీన్ పోలిశెట్టి కూడా సక్సెస్ ని కొనసాగించాలనే తపనలో ఉన్నాడు. అందుకే స్టోరీ పరంగా ఎలాంటి మిస్టేక్ ఉండకూడదని ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే కొత్త ప్రాజెక్ట్ డిలే అవుతుంది. మరి ఈ నలుగురు హీరోల్లో ముగ్గురు ఎప్పుడైనా స్టోరీ లాక్ చేసి సర్ ప్రైజ్ చేసే అవకాశం ఉంది.