'స్పైడర్‌మేన్' జంట జీవితంలో ముఖ్యఘట్టం!
స్పైడర్ మేన్ టామ్ హాలండ్ కు ప్రియురాలిగా ప్రముఖ నటి జెండయా నటించింది. తాజా సమాచారం మేరకు ఈ జంట పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు.
గాల్లో ఎగురుతూ సాహసాలు.. ప్రత్యర్థితో గగుర్పొడిచే యాక్షన్ విన్యాసాలు.. భవంతులపై నుంచి జంప్ లు.. స్పైడర్ మ్యాన్ తెరపై కనిపిస్తే చాలు ఉత్కంఠగా కళ్లప్పగించేస్తారు. అలాంటి గొప్ప వినోదాన్ని అందించిన పాత్రలో నటించాడు టామ్ హాలండ్. అతడికి ప్రపంచవ్యాప్తంగా స్కూల్, కాలేజ్ పిల్లల్లో భారీ ఫాలోవర్స్ ఉన్నారు. స్పైడర్ మేన్ సిరీస్ ని పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించారు. భారతదేశంలోను ఈ సిరీస్ ఘనవిజయం సాధించింది.
స్పైడర్ మేన్ టామ్ హాలండ్ కు ప్రియురాలిగా ప్రముఖ నటి జెండయా నటించింది. తాజా సమాచారం మేరకు ఈ జంట పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు. ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. TMZ కథనం ప్రకారం స్పైడర్ మ్యాన్ తారలు ఇటీవల ఉంగరాలు మార్చుకున్నారు. అతిథులే లేకుండా సింపుల్ గా జరిగిన వేడుక ఇదని చెబుతున్నారు. దీనికి ఇద్దరు నటుల తరపునా కుటుంబ సభ్యులు కూడా హాజరు కాలేదు. కేవలం టామ్ & జెండయా మధ్య తీపి జ్ఞాపకంగా రింగ్స్ మార్చుకునే ప్రక్రియ పూర్తయిందని చెబుతున్నారు.
ఇంతకుముందు 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల కార్యక్రమంలో జెండయా వేలికి పెద్ద డైమండ్ రింగ్ కనిపించడంతో దానిపై చాలా గుసగుసలు వినిపించాయి. కొన్ని గంటల తర్వాత టామ్ - జెండయా నిశ్చితార్థం చేసుకున్నారని భావించారు. రెడ్ కార్పెట్ షో సమయంలో లాస్ ఏంజిల్స్ టైమ్స్ రిపోర్టర్ జెండయాను రింగ్ గురించి అడిగినప్పుడు తను నేరుగా సమాధానం ఇవ్వలేదు. ముసిముసిగా, హాయిగా నవ్వేసుకుంది. క్రిప్టిక్ గా భుజాలను కుదిపింది! జెండయా ప్రవర్తన నిజంగా అభిమానుల్లో మరింత ఆసక్తిని కలిగించింది.
నిజానికి టామ్ హాలండ్ - జెండయా 2021 నుండి కలిసి జీవిస్తున్నారు. వారు తరచుగా ఔటింగులకు వెళ్లినప్పటి ఫోటోలు, వీడియోలు మీడియాలో వైరల్ అయ్యాయి. కలిసి కనిపించినా కానీ ఈ జంట తమ ప్రేమ గురించి ఓపెన్ అయిన సందర్భాలు చాలా తక్కువ. 2023లో ఎల్లే ఇంటర్నేషనల్ ఇంటర్వ్యూలో జెండయా తమ వెకేషన్ ఫోటోల హల్చల్ గురించి ప్రస్థావించింది. జెండయా మా గురించి ఏదీ రహస్యంగా దాచలేం. ఇటీవల మమ్మల్ని ఎక్కువగా మీడియా వెంబడిస్తోందని కూడా జెండయా అన్నారు.
`స్పైడర్ మ్యాన్: నో వే హోమ్` తర్వాత జెండయా - టామ్ హాలండ్ తదుపరి మార్వెల్ చిత్రంలో మరోసారి కలిసి కనిపించనున్నారు. 2026లో విడుదల కానున్న క్రిస్టోఫర్ నోలన్ చిత్రం `ది ఒడిస్సీ`లో కూడా ఈ జంట స్క్రీన్‌ను షేర్ చేసుకుంటారని ఇటీవల ధృవీకరించారు.