2024 బాక్సాఫీస్: యూఎస్ లో టాప్ సినిమాలివే

ఇలా వస్తోన్న సినిమాలలో డిస్టిబ్యూటర్స్ కి భారీ ఆదాయాన్ని అందిస్తోన్న సినిమాలు ఉన్నాయి.

Update: 2024-08-31 07:40 GMT

నార్త్ అమెరికాలో ఇండియన్స్ ఎక్కువగా ఉండటంతో మన భారతీయ చిత్రాలకి అక్కడ మంచి ఆదరణ లభిస్తోంది. ఇండియన్ బ్యాగ్రౌండ్ ఉన్న డిస్టిబ్యూటర్స్ నార్త్ అమెరికాలో మన సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. హీరో రేంజ్ బట్టి సినిమాలని భారీ ధరలకి కొనుగోలు చేస్తున్నారు. ఇలా వస్తోన్న సినిమాలలో డిస్టిబ్యూటర్స్ కి భారీ ఆదాయాన్ని అందిస్తోన్న సినిమాలు ఉన్నాయి. అలాగే నష్టాలు తీసుకొచ్చే మూవీస్ కూడా ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ నుంచి వచ్చి నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల జాబితా చూసుకుంటే మొదటి స్థానంలో కల్కి2898ఏడీ మూవీ ఉంది. ఈ సినిమా ఏకంగా 18.6 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ అందుకుంది. దేశంలో అత్యధిక కలెక్షన్స్ ని నార్త్ అమెరికాలో అందుకున్న సినిమాల జాబితాలో కల్కి రెండో స్థానంలో ఉంది. ప్రభాస్ కెరియర్ లోనే అత్యధిక వసూళ్లని సాధించిన రెండో చిత్రంగా ఇది నిలిచింది.

ఇదిలా ఉంటే దీని తర్వాత నార్త్ అమెరికాలో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సెకండ్ మూవీగా హృతిక్ రోషన్ ఫైటర్ ఉంది. ఈ సినిమా 7.62 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ అందుకుంది. శ్రద్ధా కపూర్ స్త్రీ2 మూవీ 6.33 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని ఇప్పటి వరకు కలెక్ట్ చేసి మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో హనుమాన్ మూవీ ఉంది. ఈ చిత్రం 5.31 కోట్ల మిలియన్ డాలర్స్ వసూళ్లు చేసింది.

ఐదో స్థానంలో జట్ అండ్ జూలియట్ 3 మూవీ నిలిచింది. ఈ సినిమా 4.7మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని సాధించింది. హిందీ మూవీ క్రూ 3.64 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని అందుకుంది. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా నాలుగో స్థానంలో ఉంది. తరువాత సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ మూవీ 2.93 మిలియన్ డాలర్స్ తో టాప్ 7లో ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా 2.63 మిలియన్ డాలర్స్ తో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

కల్కి 2898 AD - $18.6M

ఫైటర్ - $7.62M

స్త్రీ - $6.33M*

హనుమాన్ - $5.31M

జట్ & జూలియట్ 3 - $4.7M

క్రూ - $3.64M

టిల్లు స్క్వేర్ - $2.93M

గుంటూరు కారం - $2.63M

తెరి బతూన్ మెయిన్ ఉల్జ్హ్ జియా - $2.6M

సైతాన్ - $2.29M

Tags:    

Similar News