టాప్ స్టోరి: ఇండస్ట్రీలో పేర్లు మార్చుకున్న టాప్ స్టార్లు
సౌత్ - నార్త్ రెండు చోట్లా ఇలా పేర్లు మార్చుకున్న స్టార్లు ఎందరో ఉన్నారు.
నటించే భాష ప్రాంతీయతకు అనుగుణంగా స్టార్లు స్థానికంగా ప్రజలకు చేరువయ్యేందుకు తమ పేర్లను మార్చుకున్న సందర్భాలున్నాయి. ఆన్ స్క్రీన్ టైటిల్ కార్డ్స్ లో వేసే పేరును ఆడియెన్ కి అభిమానులకు కనెక్టయ్యేలా ఇది ఒక ప్రయత్నం. పలువురు దర్శకులు సెట్లోనే హీరోలు హీరోయిన్లకు కొత్త పేరును సూచించడం తెలిసినదే. సౌత్ - నార్త్ రెండు చోట్లా ఇలా పేర్లు మార్చుకున్న స్టార్లు ఎందరో ఉన్నారు.
అసలు పేర్లను మార్చుకున్న సౌత్ స్టార్స్ టాలీవుడ్ ని దశాబ్ధాలుగా ఏల్తున్న అజేయుడైన మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వర ప్రసాద్. అసలు పేరు కంటే కొత్త పేరు వెపన్ లా పని చేసింది. క్యాచీగా ఉండే ఒక సాధారణ పేరును ఎంపిక చేయగా పరిశ్రమలో బాగా సహాయపడుతుందనే సలహాను చిరు తీసుకున్నారు. నిజానికి అది బాగా పనిచేసింది. సౌత్ ఇండస్ట్రీలోని సంచలన కథానాయకుల్లో ఒకరిగా చిరంజీవి చరిత్రకెక్కారు.
పవన్ కళ్యాణ్ అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. కానీ అన్నయ్య తరహాలోనే క్యాచీగా ఉండేందుకు పవన్ కళ్యాణ్ ని స్క్రీన్ నేమ్ గా ఉపయోగించారు. అభిమానులు పవర్‌స్టార్ లేదా గబ్బర్ అని ముద్దుగా పిలుచుకుంటారు.
రజినీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. బస్ కండక్టర్ గా పని చేసినప్పటి పేరు ఇది. తన మరాఠీ పేరు నుంచి మారి రజనీకాంత్ గా తమిళియన్ పేరుకు అప్‌గ్రేడ్ అయ్యారు. అతడు తన పోస్ట్‌ను బస్ కండక్టర్ నుండి సౌత్ ఇండస్ట్రీలో అతిపెద్ద సూపర్ స్టార్‌గా అప్‌గ్రేడ్ చేసినట్టే ఈ మార్పు సహకరించింది. దక్షిణాదిలో ప్రజలు రజనీని ఎంతగా ఆరాధిస్తారో తెలిసినదే. రజనీకి దేశంలోనే అత్యధిక అభిమానుల ఫాలోయింగ్ ఉంది. రజనీకాంత్ అనే పేరు అద్భుతాలు చేసిందంటే ఆశ్చర్యం లేదు.
ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. అతడికి సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు స్టార్ల పేర్లు ఉన్నప్పటికీ .. పాత పేరును మార్చుకున్నాడు. ధనుష్ అని పేరు పెట్టుకున్నాడు. సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు.
నయనతార పేరు డయానా మరియం కురియన్. ఈ పేరు మార్పిడి కేవలం ఎంపిక కాదు. తన మతాన్ని క్రైస్తవ మతం నుండి హిందూ మతంలోకి మార్చినందున వచ్చిన పేరు. తన అందమైన కళ్ళకు న్యాయం చేసే ఈ అందమైన పేరును నయన్ ఎంచుకుంది. సరళమైన ఈ పేరు అభిమానుల్లోకి దూసుకెళ్లింది. తలైవిగా ఎదిగేందుకు ఈ పేరు సహకరించింది.
సూర్య శివకుమార్.. అసలు పేరు శరవణన్ శివకుమార్. కెరీర్ పరంగా మరింత విజయవంతం కావడానికి ఈ పేరు సహాయపడుతుందని నమ్మి సూర్యగా మార్చాడు. సూర్య సౌతిండియాలోనే పెద్ద స్టార్. కోలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. గజిని- సింగం లాంటి చిత్రాలతో టాలీవుడ్ లోను పెద్ద స్టార్ గా అవతరించాడు.
చియాన్ విక్రమ్ పేరుకు ఉన్న గుర్తింపు తెలిసిందే. కెన్నెడీ జాన్ విక్టర్ ఈ స్టార్ అసలు పేరు. సౌత్ ఇండస్ట్రీలో పాపులర్ స్టార్లలో ఒకడిగా ఉన్న విక్రమ్ రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన చిత్రంలో కథానాయకుడిగా నటించాడు. ఇందులో సౌందర్య ప్రధాన పాత్రధారి. నటుడిగా 1500 తొలి పారితోషికం అందుకున్నాడు. నేడు విక్రమ్ సౌతిండియాలోనే పెద్ద స్టార్. అతడు విజయాన్ని సాధించడంలో సహాయపడటానికి సాధారణ పేరును ఎంచుకున్నాడు. కెన్నెడీ పేరు ఎవరికీ తెలియనే తెలీదు.
జీవా .. అసలు పేరు అమర్. ఆ తర్వాత సినిమాల కోసం తన పేరును జీవాగా మార్చుకున్నాడు. రెండు పేర్లకు ఒకే విధమైన అర్థాలు ఉన్నందున అతడు అలా ఎందుకు చేశాడని చాలామంది ఆశ్చర్యపోతారు. అతడు తాను పోషించే పాత్రలకు జీవం పోస్తాడనే పేరుంది. అందుకే అతని పేరు జస్టిఫైడ్.
సౌందర్య అసలు పేరు వేరు- సౌమ్య సత్యనారాయణ. తెలుగు సినీపరిశ్రమలో సావిత్రి తర్వాత అంతటి గొప్ప గుర్తింపు తెచ్చుకున్న నటి. టాలీవుడ్ అగ్ర హీరోలందరి సరసనా నటించిన సౌందర్య ఎదుగుదల గురించి తెలిసిందే. దక్షిణాది ఉత్తరాది అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలను ఏలిన ఐటమ్ క్వీన్
సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. విజయవాడ నుంచి తన కీర్తిని గొప్ప శిఖరాలకు చేర్చిన మేటి నర్తకి సిల్క్.
భావనా మీనన్ ..ఈ బ్యూటీ బర్త్ నేమ్ కార్తీక మీనన్. అయితే తన పేరును భావనగా మార్చుకోవడం వల్ల తెరపై మరింత శక్తివంతం అవుతుందని నమ్మింది. ఆ నమ్మకం నిజమైంది. ఆమె మాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద స్టార్. టాలీవుడ్ కి సుపరిచితం.
బాలీవుడ్ లో నేమ్ ఛేంజ్:
అమితాబ్ అసలు పేరు శ్రీవత్సవ.. ఇంక్విలాబ్ శ్రీవత్సవ అని పేరెంట్ నామకరణం చేసారు. కానీ అమితాబ్ అని పేరు పెట్టుకున్నారు. బచ్చన్ ఇంటి పేరు. అమితాబ్ బచ్చన్ పేరుకు ఉన్న పవర్ ఎలాంటిదో తెలిసిందే. సల్మాన్ ఖాన్ పూర్తి పేరు అబ్ధుల్ రషీద్ సలీమ్ సల్మాన్ ఖాన్. కానీ సింపుల్ గా సల్మాన్ ఖాన్ అని పిలుస్తారు. కియరా అద్వాణీ అసలు పేరు ఆలియా అద్వాణీ. ఆలియా అప్పటికే ఉంది గనుక కియరాగా మార్చుకుంది. సైఫ్ అలీఖాన్ బర్త్ నేమ్ సాజిద్ అలీ ఖాన్. కానీ సైఫ్ ఖాన్ గా మార్చుకున్నాడు. కార్తీక్ ఆర్యన్ అసలు పేరు కార్తీక్ తివారీ. తివారీ కంటే ఆర్యన్ సౌండింగ్ బావుందని పేరు మార్పు చేసాడు. ఆయుష్మాన్ ఖురానా అసలు పేరు నిషాంత్ ఖురానా. రాజ్ కుమార్ రావ్ అసలు పేరు రాజ్ కుమార్ యాదవ్. కానీ వీరంతా స్వల్ప మార్పులతో ఇండస్ట్రీలో పాపులరయ్యారు.