టవల్ తో నాపై కూడా దాడి చేస్తుందేమో!
తాజాగా ఈ టవల్ ఫైట్ గురించి కత్రినా భర్త విక్కీ కౌశల్ స్పందించారు. భార్యామణి యాక్షన్ సీన్ చూసి భర్త తెగ మురిసిపోయాడు
'టైగర్ -3' లో యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్ లో పండాయో చెప్పాల్సిన పనిలేదు. సల్మాన్ ఖాన్ తో పాటు కత్రినా సైతం యాక్షన్ సన్నివేశాల్లో చెలరేగిన వైనం థియేటర్లో విజిల్స్ వేయించింది. ముఖ్యంగా టవల్ తో క్యాట్ యాక్షన్ సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. యాక్షన్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా క్యాట్ పెర్పార్మెన్స్ ప్రశంసలు కురిపించింది. ఈ ఫైట్ పై అభిమానులు అంతా ప్రశంసలు కురిపించారు.
తాజాగా ఈ టవల్ ఫైట్ గురించి కత్రినా భర్త విక్కీ కౌశల్ స్పందించారు. భార్యామణి యాక్షన్ సీన్ చూసి భర్త తెగ మురిసిపోయాడు.' ఆ ఫైట్ కోసం తానెంత కష్టపడిందో? నాకు తెలుసు. కత్రినాని అలా చూడటంతో ఎంతో సంతోషంగా అనిపించింది. నాలో స్పూర్తినింపింది. ఇకపై తనతో ఎప్పుడూ వాధించను. అలా వాదిస్తే టవల్ తో నాపై కూడా దాడి చేస్తుందేమోనని' నవ్వేసాడు. విక్కీ కౌశల్ వ్యాఖ్యలపై నెట్టింట జోకులు అలాగే పేలుతున్నాయి.
విక్కీ ఇప్పటికే క్యాట్ దెబ్బ రుచి చూసినట్లున్నాడు. అందుకే ఇలా భయపడుతున్నాడని సరదా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన టైగర్ -3 మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత సినిమాకి భారీగా ఓపెనింగ్స్ ఇచ్చినప్పటికీ తుదిగా ఎలాంటి ఫలితం సాధిస్తుందని సందేహాలు వ్యక్తమ య్యాయి. కానీ అనూహ్య వసూళ్లతో మంచి విజయం సాధించింది. దీంతో విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు.
ఇక డిసెంబర్ 1న విక్కీ కౌశల్ యానిమల్ తో యుద్దానికి సిద్దమైన సంగతి తెలిసిందే. ఆయన కథానాయకు డిగా నటించిన 'శామ్ బధూర్' అదే రోజున రిలీజ్ అవుతుంది. 'యానిమల్' కంటే విక్కీ చిత్రానికి బజ్ తక్కువగా ఉంది. యానిమల్ దాడిని శామ్ బహదూర్ తట్టుకుని నిలబడతాడా? లేదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరి 'యానిమల్' వేగానికి విక్కీ ఎలాంటి బ్రేక్ వేస్తాడో చూడాలి.