బిజినెస్‌మేన్‌తో నటి డేటింగ్ ఫిక్సయినట్టే..!
బాలీవుడ్లో చాలా ప్రేమకథలు తెరవెనుకే నడుస్తుంటాయి. జంటలు చివరివరకూ అధికారికంగా డేటింగ్ గురించి ప్రకటించరు.
బాలీవుడ్లో చాలా ప్రేమకథలు తెరవెనుకే నడుస్తుంటాయి. జంటలు చివరివరకూ అధికారికంగా డేటింగ్ గురించి ప్రకటించరు. చిట్టచివర్లో పెళ్లి చేసుకుంటున్నాం..! అంటూ అసలు గుట్టు బయటపెడుతుంటారు. అప్పటివరకూ వారిపై రాసేవన్నీ గాసిప్స్ గానే చూడాలి. మీడియాలు ఠాంఠాం చేస్తున్నా అదేమీ పట్టింపే లేదు.
ఇప్పుడు అదే తీరుగా ఉంది ఈ జంట వ్యవహారం. గత కొన్నేళ్లుగా కృతి సనన్ ప్రముఖ బిజినెస్ మేన్ తో డేటింగ్ లో ఉందంటూ ప్రచారం ఉంది. గతంలో ఈ ఇద్దరూ విదేశీ వెకేషన్లకు వెళ్లినప్పటి ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు తన బాయ్‌ఫ్రెండ్ కబీర్ బహియా పుట్టినరోజు సందర్భంగా వెకేషన్ లో అతడితో సెల్ఫీ దిగిన కృతి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపింది. కబీర్ తో కృతి సాన్నిహిత్యం చూశాక, ఇప్పుడు అతడితో తన సంబంధాన్ని ఇన్‌స్టాలో అఫీషియల్‌గా మార్చుకుందని నెటిజన్లు భావిస్తున్నారు.
కృతి సనన్ కొంతకాలంగా వ్యాపారవేత్త కబీర్ బహియాతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఈ జంట ఇటీవల గ్రీస్‌లో విహారయాత్రలో కలిసి ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. విహారయాత్రలో కృతితో పాటు తన సోదరి నూపూర్ కూడా ఉంది. కృతి ఈ పుకార్ల గురించి ఇంకా మాట్లాడలేదు. కనీసం స్పందించనూ లేదు.
ఇటీవలే కబీర్ తో కృతి విమానాశ్రయంలో కనిపించింది. కానీ ఫోటోలకు ఫోజులిచ్చేందుకు నిరాకరించారు. ఇదిలా ఉండగా ఇప్పుడు కబీర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు కృతి వెకేషన్ లో కబీర్‌తో కలిసి ఉన్న మొదటి ఫోటోని షేర్ చేసింది. ``పుట్టినరోజు శుభాకాంక్షలు K. మీ అమాయకపు చిరునవ్వు ఎల్లప్పుడూ సజీవంగా ఉండనివ్వండి`` అని అతడిపై తన ప్రేమను దాచుకోలేదు కృతి. కబీర్ హార్ట్ అండ్ కౌగిలింత ఎమోజీలతో మళ్లీ దానిని షేర్ చేసాడు. కృతి సోదరి నూపూర్ బాయ్‌ఫ్రెండ్ స్టెబిన్ బెన్ కూడా కృతి -కబీర్‌లతో కలిసి ఉన్న ఒక ఫోటోని షేర్ చేసాడు. అతడికి శుభాకాంక్షలు తెలిపారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే... కృతి చివరిగా తాను స్వయంగా నిర్మించిన `దో పట్టి`లో కనిపించింది. ఈ చిత్రం OTTలో మంచి వసూళ్లు రాబట్టింది.