ప్రశాంత్ నీల్ బాలీవుడ్ హీరోయిన్ల జోలికి వెళ్లడా?
కేజీఎఫ్ మొదటి భాగం సహా రెండవ భాగంలోనే అదే భామను కంటున్యూ చేసాడు. అటుపై ప్రభాస్ తో `సలార్` చిత్రాన్ని తెరకెక్కించాడు.
పాన్ ఇండియా సంచలనం ప్రశాంత్ నీల్ బాలీవుడ్ హీరోయిన్లను టచ్ చేయడా? తన సినిమా హీరోయిన్లు అంతా సౌత్ భామలే అవ్వాలా? బాలీవుడ్ భామలకు ఛాన్స్ ఇవ్వడా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది. `కేజీఎఫ్` తో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా వరల్డ్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అందులో యశ్ కి జోడీగా కన్నడ భామ శ్రీనిధి శెట్టి నటించింది. కేజీఎఫ్ మొదటి భాగం సహా రెండవ భాగంలోనే అదే భామను కంటున్యూ చేసాడు. అటుపై ప్రభాస్ తో `సలార్` చిత్రాన్ని తెరకెక్కించాడు.
ఇందులో హీరోయిన్ గా చెన్నై భామ శ్రుతి హాసన్ నటించింది. `సలార్ 2` లో ఆమె పాత్ర ఇంకా కీలకంగా ఉంటుంది. తొలి భాగంలో అమ్మడు పాత్ర కథను మలుపు తిప్పేది. దీంతో రెండవ భాగంలో ఆపాత్రకు మరింత ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తుంది. మరి మూడవ చిత్రం లోనైనా బాలీవుడ్ భామకు ఛాన్స్ ఉందా? అదీ లేదని తేలిపోయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన మూడవ పాన్ ఇండియా చిత్రం `డ్రాగన్` లైన్ లో ఉన్న సంగతి తెలిసిందే.
ఇందులో తారక్ కిజోడీగా రుక్మీణి వసంత్ ని హీరోయిన్ గా ఫైనల్ చేసాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. అలాగే ప్రశాంత్ నీల్ డెబ్యూ `ఉగ్రం`లో కూడా కన్నడ భామనే తీసుకున్నాడు. అందులో హరి ప్రియ హీరోయిన్ గా నటించింది. ఇలా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన నాలుగు సినిమాల్లో మూడు చిత్రాల్లో కన్నడ భామలే హీరోయిన్లు అవ్వడం విశేషం. దీన్ని బట్టి ప్రశాంత్ నీల్ తన స్థానిక భామల్ని ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తుంది.
ప్రశాంత్ నీల్ తెలుగు మూలాలున్న కన్నడిగి అన్న సంగతి తెలిసిందే. తెలుగు మాట్లాడుతాడు . కానీ కన్నడిగిని అభిమానిస్తాడు. మరి భవిష్యత్ లో నైనా బాలీవుడ్ భామలకు తన సినిమాల్లో ఛాన్స్ ఇస్తాడా? లేదా? అన్నది చూడాలి. అయితే ప్రశాంత్ నీల్ సినిమాల్లో నటించిన ఈ భామలెవరూ తదుపరి పెద్ద బిజీ కాలేదు. ఆ పాన్ ఇండియా క్రేజ్ అన్నది నీల్ సినిమా వరకే పరిమితమైంది.