హీరోలు పబ్లిసిటీ కోసమే అలా మాట్లాడుతున్నారా?
ఇటీవలే ఓ ముగ్గురు హీరోలు అలాగే ఓపెన్ అయ్యారు. తమ వ్యక్తిగతానికి సంబంధించి..కుటుంబాలకు సంబంధించి తామంతా ఏం చెప్పాలనుకున్నారో?
అప్పుడప్పుడు హీరోలు ఎంతో ఓపెన్ గా మాట్లాడుతుంటారు. అలా మాట్లాడినప్పుడే ఆ హీరోల రియాల్టీ ఏంటి? అన్నది కూడా బయట పడుతుంటుంది. అయితే అది అన్ని వేళలా జరగదు. సమయం..సందర్భం వచ్చినప్పుడు మాత్రమే అలాంటి పరిస్థితులకు దారి తీస్తుంటుంది. ఇటీవలే ఓ ముగ్గురు హీరోలు అలాగే ఓపెన్ అయ్యారు. తమ వ్యక్తిగతానికి సంబంధించి..కుటుంబాలకు సంబంధించి తామంతా ఏం చెప్పాలనుకున్నారో? అంతా ఎంతో ఓపెన్ గా ప్రేక్ష కాభిమానుల సమక్షంలోనే ఓపెన్ అయ్యారు.
వాళ్లు అలా మాట్లాడటానికి కారణం అంతకు ముందు దారి తీసిన కొన్ని రకాల పరిస్థితులు కావొచ్చు. ఇంకేవైనా కావొచ్చు. కానీ మాట్లాడిన మాటల్లో వాస్తవం..పెయిన్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే వాళ్లంతా ఇలా మాట్లా డటాన్ని కొందరు వక్రీకరిస్తున్నారనే వాదన తెరపైకి వస్తోంది. ఇదంతా సినిమా పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టేస్తున్నారు. సినిమా మార్కెట్ లోకి వెళ్లాలన్నా? రెగ్యులర్ గా మాట్లాడినా? సినిమా గురించి ఎంత ఊదరగొట్టినా? జనాల్లోకి వెళ్లదు.
అలాంటప్పుడు ఏదో రకమైన కాంట్ర వర్శీ మాట్లాడినప్పుడే? ఆ సినిమా గురించి జనాల్లో డిస్కషన్ జరుగుతుం దని...ఇదంతా పక్కా ప్లానింగ్ ప్రకారం వెనుకుండి నడిపించే కొందరు మాస్టర్ల పని అని అంటున్నారు. సినిమా పబ్లిసిటీకి ఇదొక కొత్త స్ట్రాటజీ గా భావిస్తున్నారు. మరి ఇది స్ట్రాటజీనా ? ఆ హీరోలు పెయిన్ అలా బయటకు వచ్చిం దా? అన్నది ఆపెరుమాళ్లకే ఎరుక. ఈ మధ్య కాలంలో ప్రాంక్ వీడియోలు ఎలా సంచలనమవుతున్నాయో తెలిసిందే.
చివరికి ఆ వీడియోలు చీవాట్లు..చెప్పు దెబ్బలు సైతం తినిపిస్తున్నాయి. అయినా సరే ప్రాంక్ వీడియోలు అదుపు లోకి రాలేదు. సోషల్ మీడియా ఆచరణలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఇంత దారుణంగా మారింది. ఏది నిజమో? ఏది అబద్దమో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.