నవంబర్లో క్యూటీ 'పెళ్లి మూడ్'?
ఇలాంటి సమయంలో `నవంబర్ మూడ్` గురించి ప్రస్థావించింది ఈ బ్యూటీ. బహుశా త్రిథా చౌదరి పెళ్లి మూడ్ లోకి వెళ్లిందా? అంటూ అభిమానుల్లో సందేహాలు రేకెత్తాయి.
సెప్టెంబర్ మాసం సెప్టెంబర్ మాసం...పాత బాధలు తలెత్తనివ్వం..అక్టోబర్ మాసం అక్టోబర్ మాసం..కొత్త బాధలు తలెత్తుకున్నాం బాధ తీరేదెపుడో ప్రేమ పుట్టిననాడే..శాంతి పోయేదెపుడో కళ్యాణం పూర్తైన నాడే!!
బ్లాక్ బస్టర్ `సఖి` సినిమాలోనిది ఈ పాట. లెజెండరీ లిరిసిస్ట్ వేటూరి సుందర రామమూర్తి అద్భుత సాహిత్యం, స్వరమాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ స్వరకల్పనలో రూపొందించిన ఈ పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ రొమాంటిక్ సాంగ్. మ్యాడీ మాధవన్, షాలిని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి మణిరత్నం దర్శకత్వం వహించారు.
అయితే ఈ పాట గురించి.. ఈ సినిమా గురించి.. ఇప్పుడే గుర్తు చేసుకోవడానికి కారణం ఉంది. ఈ నవంబర్, డిసెంబర్ లో పెళ్లి ముహూర్తాలు పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో `నవంబర్ మూడ్` గురించి ప్రస్థావించింది ఈ బ్యూటీ. బహుశా త్రిథా చౌదరి పెళ్లి మూడ్ లోకి వెళ్లిందా? అంటూ అభిమానుల్లో సందేహాలు రేకెత్తాయి.
అన్నట్టు త్రిథా అంటే ఎవరో తెలుసు కదా! తెలుగులో యువహీరోల సరసన నటించిన ఈ బ్యూటీ తన సినిమాల్లో తానే షో స్టాపర్ అని నిరూపించింది. నిఖిల్ సరసన `సూర్య వర్సెస్ సూర్య` చిత్రంలో నటించిన త్రిధా చౌదరి యువహీరో సరసన చక్కని నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత `మనసుకు నచ్చింది` అనే చిత్రంలోనూ నటించింది. వరుసగా చిన్న బడ్జెట్ సినిమాలతో యూత్ కి చేరువైంది. సెవెన్.. అనుకున్నదొక్కటి అయినదొక్కటి చిత్రాలతో ఇటీవలే తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. అయితే ఆశించిన విజయాలు మాత్రం దక్కలేదు. ఈ బ్యూటీ స్పాట్ లైట్ అనే వెబ్ సిరీస్ తో యూత్ లోకి దూసుకెళ్లింది. ఈ సిరీస్ ఆద్యంతం వేడెక్కించే లిప్ లాక్ లతో త్రిధా మంటలు పుట్టించింది. డిజిటల్ యుగంలో ఓటీటీ ప్రపంచంలో త్రిథాకు అవకాశాలు పెరిగాయి. బాలీవుడ్ లో బుల్లితెర, ఓటీటీ రెండిటా పాపులరైంది. మరోవైపు సోషల్ మీడియాల్లో బికినీ ఫోటోషూట్స్ తో చెలరేగుతోంది. త్రిధా తాజా ఫోటోషూట్ అంతే వైరల్ గా మారింది. త్రిథా అలా ఒంటరి దీవుల విహారంలో స్టన్నింగ్ ఫోజ్ తో వేడెక్కించింది.
నవంబర్లో మిగిలిన మూడ్..! అంటూ రొమాంటిక్ క్యాప్షన్ ఇచ్చింది. #travelwithtridha # #beachwaves #beachbum అంటూ హ్యాష్ ట్యాగులు వైరల్ చేస్తోంది. ఇది పాపులర్ స్కిన్ కేర్ బ్రాండ్ ప్రచారానికి సంబంధించిన ఫోటోషూట్ సమయం. అందుకే క్యూటీ నవంబర్ మూడ్ లోకి వెళ్లింది. ఒకవేళ పెళ్లి కుదిరితే అధికారికంగా అభిమానులకు చెప్పే చేసుకుంటుంది మరి!