యానిమల్ బ్యూటీని ఏడిపించారు..!

ఐతే యానిమల్ సినిమాతో త్రిప్తి డిమ్రి మాత్రం ఒక రేంజ్ లో పాపులారిటీ సంపాధించింది.

Update: 2024-10-05 05:22 GMT

గ్లామర్ ఫీల్డ్ లో ఎవరికి ఎప్పుడు ఎలా కెరీర్ టర్న్ అవుతుంది అన్నది చెప్పడం కష్టం. మనం చేయాల్సింది చేసుకుంటూ పోతే రావాల్సిన ఫలితం వస్తుందని పెద్దలు చెప్పినట్టుగానే కష్టానికి తగిన ఫలితం కూడా వస్తుందని కొందరిని చూస్తే తెలుస్తుంది. బాలీవుడ్ లో హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకోవడం అనేది చాలా పెద్ద సవాల్. ఐతే యానిమల్ సినిమాతో త్రిప్తి డిమ్రి మాత్రం ఒక రేంజ్ లో పాపులారిటీ సంపాధించింది. అంతకుముందు అమ్మడు సినిమాలు, వెబ్ సీరీస్ లు చేసినా కూడా వర్క్ అవుట్ కాలేదు. కానీ యానిమల్ సినిమాతో అమ్మడు ఒక రేంజ్ క్రేజ్ తెచ్చుకుంది.

ఐతే కెరీర్ లో సక్సెస్ కొట్టిన టైం లో తమ కెరీర్ ఎలా మొదలైంది. స్టార్టింగ్ డేస్ లో ఎలా స్ట్రగుల్ అయ్యామన్నది అలా ఒక్కసారి గుర్తుకొస్తుంది. యానిమల్ బ్యూటీ త్రిప్తి కూడా తన కెరీర్ తొలినాళ్ల పరిస్థితులను ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. చదువు మీద ఆసక్తి లేక మోడలింగ్ మీద దృష్టి పెట్టా. ఐతే అది మా ఇంట్లో వాళ్లకు నచ్చలేదు అయినా వెనక్కి తగ్గలేదని చెప్పింది త్రిప్తి. అంతేకాదు సినిమా గురించి అసలేమాత్రం తెలియకపోయినా సినిమాల్లోకి వచ్చేశా.

సినిమా గురించి ఎలాంటి అవగాహనా లేకుండానే వచ్చాయని అన్నారు. ఐతే తను చేసిన లైలా మజ్ను సినిమా కోసం చాలా కష్టపడ్డానని. సెట్ లో వాళ్లు చెప్పేది అర్ధం కాక ఎన్నోసార్లు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది త్రిప్తి. కెరీర్ మొదట్లో దాదాపు అందరికీ ఇలాంటి అనుభవాలే ఉంటాయి. స్టార్ హీరోయిన్ అయిన ప్రతి ఒక్కరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వారి కెరీర్ మొదలు పెట్టిన నాటి పరిస్థితులు వాళ్లను సర్ ప్రైజ్ చేస్తాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే త్రిప్తి ముచ్చటగా 3 సినిమాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ లో ఫుల్ ఫాం లో ఉన్న త్రిప్తికి టాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తుంది. త్రిప్తి తెలుగు ఎంట్రీ ఇస్తే మాత్రం ఆమెకు స్టార్ క్రేజ్ ఇచ్చేందుకు ఆడియన్స్ రెడీగా ఉన్నారు. ఐతే ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ సినిమాలతోనే బిజీగా ఉంది. విజయ్ దేవరకొండ సినిమాలో త్రిప్తి హీరోయిన్ గా చేస్తుందని అన్నారు. కానీ దానికి సంబంధించిన ఎలాంటి అఫీషియల్ అప్డేట్ బయటకు రాలేదు.

Tags:    

Similar News