బికినీలో కాక‌లు పుట్టిస్తున్న యానిమ‌ల్ ట్రిప్తి

ట్రిప్తి దిమ్రీ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈ బ్యూటీ అందంతో పాటు అద్భుత‌మైన‌ న‌ట‌ప్రద‌ర్శ‌న‌తో కుర్ర‌కారు గుండెల్ని ట‌చ్ చేస్తుంది

Update: 2024-06-19 03:44 GMT

ట్రిప్తి దిమ్రీ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈ బ్యూటీ అందంతో పాటు అద్భుత‌మైన‌ న‌ట‌ప్రద‌ర్శ‌న‌తో కుర్ర‌కారు గుండెల్ని ట‌చ్ చేస్తుంది. బ్లాక్ బ‌స్ట‌ర్ `యానిమ‌ల్` చిత్రంలో క‌నిపించింది 10 ని.ల పాత్ర‌లోనే అయినా కానీ, శాశ్వ‌తంగా గుర్తుండిపోయింది. అప్ప‌టి నుంచి ట్రిప్తిపైనే ప‌రిశ్ర‌మ దృష్టి కేంద్రీకృత‌మై ఉంది.

ప్ర‌స్తుతం ఈ భామ వ‌రుస ఫోటోషూట్ల‌తో ఇన్ స్టా వేదిక‌గా భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది. ఇప్పుడు ఇటలీ నుంచి త్రిప్తి డిమ్రీ ట్రీట్ షురూ అయింది. ట్రిప్తి డిమ్రీ మంగళవారం తన ఇటాలియన్ వాకే నుండి బికినీ ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ బికినీతో పాటు, గ్రీన్ బికినీలోను ఈ భామ‌ ప్ర‌త్యక్ష‌మైంది. మ‌రో ఫోటోలో నీలం రంగు బికినీని ధరించింది. బీచ్ ఎండ‌లో సన్ గ్లాసెస్ ధరించి కనిపించింది. ట్రిప్తి నియాన్ గ్రీన్ బికినీని ధరించి దానిపై తెల్లటి షర్టును కలుపుతూ కనిపించింది. అలాగే బీచ్ లో ఆడుకుంటున్న‌ రెండు కుక్కపిల్లల క్యూట్ ఫోటోని కూడా పోస్ట్ చేసింది.

ట్రిప్తి ఎండలో చెమ‌ట‌కు తడిసి ముద్ద‌యిన ఫోటోలు క‌నిపిస్తున్నాయి..అలాగే బీచ్ సైడ్ చంద్రుని ఫోటోని కూడా షేర్ చేసింది. హ్యాపీ యాజ్ సీషెల్(ఎమోజి) అనే సింపుల్ క్యాప్ష‌న్ ని ట్రిప్తి రాసింది. ఈ పోస్ట్ వేగంగా వైర‌ల్ అయింది. దీనిపై నెటిజన్లు త‌మ‌దైన శైలిలో స్పందించారు. బికినీలో నా సంస్కారీ లడ్కీని చూడటం స్వర్గంలో ఉన్న‌ అనుభూతి! అని ఒకరు రాశారు. యానిమల్ 2లో ట్రిప్తి పాత్ర గురించి ఊహాగానాలు సాగించారు కొంద‌రు. ఎటు చూసినా వేడి తరంగాలను సృష్టిస్తోంది అంటూ కితాబిచ్చాడు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే..ట్రిప్తీ వ‌రుస‌గా సీక్వెల్ సినిమాల్లో క‌థానాయిక‌ల‌ను రీప్లేస్ చేస్తోంది. `ఆషిఖి 3` స‌హా ప‌లు చిత్రాల్లో ట్రిప్తి అవ‌కాశాలు అందుకుంది. ప్ర‌ఖ్యాత‌ భూల్ భూలైయా ఫ్రాంఛైజీలో పార్ట్ 3 లో న‌టిస్తూ బిజీగా ఉంది. క‌ర‌ణ్ జోహార్ ద‌ఢ‌క్ 2లోను అవ‌కాశం ఇచ్చారు. అలాగే `బాడ్ న్యూజ్` (గుడ్ న్యూజ్ ఫ్రాంఛైజీ చిత్రం) చిత్రీకరణను పూర్తి చేసింది. త‌దుప‌రి స‌లార్ 2లోను న‌టించే ఛాన్సుంది. అయితే వ‌రుస‌గా అడ్వాన్సులు అందుకుంటున్న ట్రిప్తి దిమ్రీ త‌న సంపాద‌న‌ను రియ‌ల్ ఎస్టేట్ లో పెట్టుబ‌డిగా పెడుతోంది. ఇటీవ‌లే బాంద్రాలో ఖ‌రీదైన బంగ్లాను కొనుక్కున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News