యానిమల్ పిల్లకి బన్నీతో ఛాన్స్.. ఇది బిగ్గెస్ట్ ఆఫర్!

పుష్ప రాజ్ సాధారణ స్మగ్లర్ నుంచి పెద్ద వ్యాపారిగా మారి.. సిండికేట్ వ్యాపారాన్ని ఎలా చేశారన్న పాయింట్ తో సీక్వెల్ రాబోతోంది

Update: 2024-03-19 07:46 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప-2 కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకూ అంచనాలు పెంచుకుంటున్న ఈ సినిమా.. ఆగస్టు 15వ తేదీన విడుదల కానుంది. పుష్ప ఫస్ట్ పార్ట్ సెన్సేషనల్ హిట్ అవ్వడంతో.. లెక్కల మాస్టర్ సుకుమార్ పుష్ప-2ను భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

పుష్ప రాజ్ సాధారణ స్మగ్లర్ నుంచి పెద్ద వ్యాపారిగా మారి.. సిండికేట్ వ్యాపారాన్ని ఎలా చేశారన్న పాయింట్ తో సీక్వెల్ రాబోతోంది. దీంతో ఈ సినిమాపై బజ్ ఓ రేంజ్ లో ఉంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నారు మేకర్స్. ఓ వైపు షూటింగ్, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆగస్టు 15వ తేదీన ఎలాగైనా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు.

ఫుల్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాలో స్టార్ నటీనటులు యాక్ట్ చేస్తున్నారు. మెయిన్ గా బాలీవుడ్ యాక్టర్లను తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న త్రిప్తి డిమ్రీని పుష్ప మేకర్స్ సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. యానిమల్ చిత్రంతో లైమ్ లైట్ లోకి వచ్చిన త్రిప్తి.. పుష్ప-2లో కీలక పాత్ర పోషిస్తోందట.

పుష్పరాజ్ అనుచరుడిని ట్రాప్ చేసే రోల్ లో త్రిప్తి డిమ్రీ నటించనుందట. ఇప్పటికే త్రిప్తిని మేకర్స్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. పాత్ర చిన్నదే అయినా.. ఆమె రోల్ ఎఫెక్ట్ సినిమాపై పడుతుందట. బన్నీ, త్రిప్తి కాంబోలో వచ్చిన సీన్లు... సినిమాకు హైలైట్ గా నిలవనున్నాయట. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట. ఆ వెంటనే త్రిప్తి.. పుష్ప-2 సెట్స్ లో అడుగుపెట్టనుందట.

అల్లు అర్జున్ సరసన మరోసారి శ్రీవల్లి పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆడిపాడనుంది. మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా.. సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Tags:    

Similar News