త్రిష కంబ్యాక్ తో ఆమె కి అన్ని రకాలుగా చెక్!
ఈ విషయంలో ఇద్దరి మధ్యా నువ్వా? నేనా? అన్న రేంజ్ లో పోటీ వాతావరణం కనిపిస్తుంది.
టాలీవుడ్ లో త్రిష కంబ్యాక్ తో స్వీటీ అనుష్కకి చెక్ పడే అవకాశం ఉందా? అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. నటీమణులుగా ఇద్దరు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. కానీ హీరోయిన్ గా అనుష్క కంటే త్రిష చాలా సీనియర్. క్రేజ్ పరంగా ఇద్దరు పోటా పోటీగానే కనిపిస్తారు. కానీ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న'విశ్వంభర'లో త్రిషని తీసుకోవడమే అనుష్కని టెన్షన్ పెట్టే వార్తగా కనిపిస్తుంది.
ఈ సినిమాలో చిరు సరసన ఇద్దరు పేర్లు మేకర్స్ పరిశీలించి..చివరిగా త్రిషని ఎంపిక చేసారు. ఈ విషయంలో ఇద్దరి మధ్యా నువ్వా? నేనా? అన్న రేంజ్ లో పోటీ వాతావరణం కనిపిస్తుంది. చాలా మంది అనుష్కని తీసుకుంటే బాగుంటుందని మెజార్టీ వర్గం భావించింది. కానీ మేకర్స్ మాత్రం త్రిషని తెరపైకి తెచ్చి సర్ ప్రైజ్ చేసారు. దీంతో 'స్టాలిన్' తర్వాత మరోసారి చిరు సరసన త్రిష ఛాన్స్ అందుకోవడం విశేషం.
అలాగే చిరంజీవి సరసన అనుష్క కూడా 'సైరా నరసింహారెడ్డి'లో చిన్న రోల్ పోషించింది. అయితే అనుష్క ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఆమెని కాదని త్రిషని సీన్ లోకి తెవడంతో? అనుష్క ఇమేజ్ పై మసకబారినట్లు కొత్త ప్రచారం తెరపైకి వస్తోంది. తెలుగు లో సినిమాలే మానేసిన త్రిషని పనిగట్టుకుని 'విశ్వంభర' కోసం ఆమెని తేవడం వెనుక అర్దం ఏంటి? అనే ప్రచారం ఊపందుకుంటుంది.
అందులోనూ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న యూవీ క్రియేషన్స్ అంటే అనుష్కకి సొంత బ్యానర్ లాంటింది. నిర్మాతలతో ఆమె ఎంతో క్లోజ్ ప్రెండ్ షిప్ ఉంది. అలాంటి అనుష్కని కాదని త్రిషని తీసుకోవడం వెనుక అసలు కారణాలు ఏమై ఉంటాయి? అన్నది ఫోకస్ అవుతుంది. అనుష్క రిజెక్షన్ అనేది కూడా ఇక్కడితో ఆగిపోయేది కాదని వినిపిస్తుంది. ఇండస్ట్రీలో సీనియర్ హీరోలకు అనుష్క పక్కాగా సూట్ అయ్యే హీరోయి న్ అని అభిమానులు సహా పరిశ్రమ గట్టిగా నమ్మింది.
కానీ మళ్లీ ఇప్పుడు త్రిష కంబ్యాక్ అవ్వడం వల్ల సీనియర్ హీరోలకు త్రిష ప్రత్యామ్నాయం అయ్యే అవకాశం ఉందని.. హీరోలంతా ఆమె వైపు ఆసక్తి చూపించడానికి ఛాన్స్ ఉందని అంటున్నారు. త్రిష ఇప్పటికే నాగార్జున..వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో పనిచేసింది. ఇంకా ఆ తర్వాత తరం హీరోల తోనూ నటించింది. కానీ అనుష్క తర్వాత తరం హీరోలందర్నీ ఇంకా కవర్ చేయలేదు. కంబ్యాక్ నేపథ్యంలో అనుష్క ఆ రకమైన ప్లానింగ్ చేసుకుంటుంది. కానీ ఇంతలోనే పెద్ద ప్రాజెక్ట్ మిస్ అవ్వడం అభిమానుల్ని నిరుత్సాహ పరుస్తుంది.