త్రిష - మన్సూర్ వివాదం.. రెడ్ కార్డుతో దెబ్బ

ఇదిలా ఉంటే త్రిష గురించి నేనేదో సరదాగా చేసిన కామెంట్స్ ని ఇలా ఎవరో కావాలని వైరల్ చేస్తూ రాజకీయం చేస్తున్నారని, తన ఇమేజ్ ని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

Update: 2023-11-21 06:20 GMT

కోలీవుడ్ యాక్టర్, లియో నటుడు మన్సూర్ ఆలీఖాన్ హీరోయిన్ త్రిషపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికి తెలిసిందే. లియో సినిమాలో త్రిష రేప్ సీన్ లేకపోవడం చాలా బాధపడ్డానంటూ మన్సూర్ ఆలీఖాన్ ఒక మీడియా సమావేశంలో కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. వీటిపై సెలబ్రిటీల నుంచి సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే కోలీవుడ్ లో సినీ ప్రముఖులు అందరూ స్పందించి ఆ వ్యాఖ్యలని ఖండించారు.

త్రిష కూడా మన్సూర్ ఆలీఖాన్ వ్యాఖ్యలపై తన ఆవేదన వ్యక్తం చేసింది. లోకేష్ కనగరాజ్ కూడా స్పందించి వ్యాఖ్యలని ఖండించారు. ఇదిలా ఉంటే త్రిష గురించి నేనేదో సరదాగా చేసిన కామెంట్స్ ని ఇలా ఎవరో కావాలని వైరల్ చేస్తూ రాజకీయం చేస్తున్నారని, తన ఇమేజ్ ని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అయితే తాను చేసిన కామెంట్స్ విషయంలో త్రిషకి సారీ మాత్రం చెప్పానని మన్సూర్ స్టేట్ మెంట్ ఇవ్వడం విశేషం.

మరో వైపు అతను క్షమాపణ చెప్పాలనే డిమాండ్ చేసే వారిసంఖ్య పెరుగుతోంది. సౌత్ ఇండియన్ యాక్టర్స్ అసోసియేషన్ కోరితే వివరణ ఇస్తానని మన్సూర్ ఆలీఖాన్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ హీరో నితిన్ ఈ ఇష్యూపై స్పందించారు. మన్సూర్ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలకి ఇండస్ట్రీలో చోటు లేదు. నీచమైన వ్యాఖ్యలు చేసే వారిపై పోరాడాలని, మహిళలకి మద్దతుగా నిలబడాలని నితిన్ కోరారు. త్రిషకి తన మద్దతు ఉంటుందని తెలిపారు.

ఇక మన్సూర్ ఆలీఖాన్ వ్యాఖ్యలని సీరియస్ గా తీసుకున్న మహిళ కమిషన్ ఇప్పటికే సుమోటోగా కేసు తీసుకొని అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలంగాణ పోలీసులకి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అతనికి రెడ్ కార్డ్ జారీ చేసే యోచనలో భారతీయ సినీ నటుల సంఘం ఉంది. అది చేస్తే తరువాత అతన్ని ఏ సినిమాలలో కూడా తీసుకోవడానికి అవకాశం ఉండదు.

కోలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి కూడా మన్సూర్ వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆయన మీద చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. దీనిపై కోలీవుడ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, నటీనటుల సంఘం ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి.

Tags:    

Similar News