యంగ్ హీరోకి అమ్మగా త్రిష.. ఫ్యాన్స్ ఊరుకుంటారా?

మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్‌ హిట్‌ బ్రో డాడీ ని రీమేక్ చేసేందుకు సిద్ధం అయ్యాడు అనే విషయం తెల్సిందే

Update: 2023-08-02 05:26 GMT

సుదీర్ఘ కాలంగా సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ హోదాను అనుభవిస్తున్న ముద్దుగుమ్మ త్రిష. తెలుగు లో సినిమాలు చేసినా చేయకున్నా కూడా స్టార్‌ హీరోయిన్ అనే హోదా కంటిన్యూ అయ్యే విధంగా ఆమె వ్యవహరిస్తూ ఉంది. తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న త్రిష తెలుగు లో మాత్రం ఆచి తూచి అన్నట్లుగా కొత్త ఆఫర్లు ఎంపిక విషయంలో వ్యవహరిస్తూ ఉంది.

మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్‌ హిట్‌ బ్రో డాడీ ని రీమేక్ చేసేందుకు సిద్ధం అయ్యాడు అనే విషయం తెల్సిందే. ఈ రీమేక్ లో చిరంజీవికి జోడీగా త్రిష ను ఎంపిక చేయడం జరిగిందట. సోగ్గాడే చిన్నినాయన సినిమా దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్ హీరో నటించబోతున్నాడు.

చిరంజీవి తనయుడి పాత్రలో నటించబోతున్న యంగ్‌ హీరో ఎవరు అనే విషయమై రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొదట సిద్దు జొన్నలగడ్డ అన్నారు.. ఇప్పుడు శర్వానంద్ అనే ప్రచారం జరుగుతోంది. అసలు విషయం ఏంటి అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

ఏ యంగ్‌ హీరో నటించినా కూడా ఆ హీరోకు తల్లి పాత్రలో త్రిష కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి తనయుడిగా సదరు యంగ్ హీరో కనిపిస్తే... చిరుకు జోడీగా నటించే త్రిష కు కూడా ఆ హీరో కొడుకు అవుతాడు. అంటే త్రిష యంగ్‌ హీరోకు అమ్మ పాత్రలో కనిపించబోతున్నట్లుగా భావించవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

త్రిష వంటి స్టార్‌ హీరోయిన్‌ ను యంగ్‌ హీరోకు తల్లిగా చేస్తే ఫ్యాన్స్ అంగీకరిస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చిరంజీవి కి జోడీగా త్రిష అంటే పర్వాలేదు కానీ.. యంగ్‌ హీరోకు తల్లిగా అంటే ఫ్యాన్స్ అంగీకరించే పరిస్థితి లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి దర్శకుడు ఈ విషయాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాడో చూడాలి.

Tags:    

Similar News