త్రివిక్రమ్ - బన్నీ.. తగలబెట్టే ప్లాన్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు.

Update: 2024-12-10 23:30 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే 900+ కోట్ల మార్క్ దాటేసింది. ఇక ఆరు రోజుల్లో 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ చాలా ప్రాంతాలలో లాభాల బాటలోకి వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో అయితే ఈ సినిమాని ఆడియన్స్ పూనకాలు వచ్చినట్లు చూస్తున్నారు.

80, 90వ దశకంలో చిరంజీవి, బాలయ్య సినిమాలకి గ్రామీణ ప్రాంతాలలో టికెట్స్ కోసం థియేటర్స్ దగ్గర ఎగబడేవారు. ఇప్పుడు అలాంటి వాతావరణం నార్త్ లో ‘పుష్ప 2’కి కనిపిస్తోంది. హిందీలో ఈ చిత్రం రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో కూడా బన్నీ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ఈ సినిమాకి వస్తాయని అనుకుంటున్నారు. ఏపీలో టికెట్ ధరలు కూడా తగ్గించిన నేపథ్యంలో ఆడియన్స్ తాకిడి పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే ‘పుష్ప 2’తో అల్లు అర్జున్ కి పాన్ ఇండియా లెవల్ లో టాప్ స్టార్ గా ఇమేజ్ వచ్చేసింది. దీంతో అతని నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాలపైన కూడా హై ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. దేశ వ్యాప్తంగా ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకొని ఆయన కథల ఎంపిక ఉండాలి. ఇక బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్నాడు. ఇప్పుడు మాటల మాంత్రికుడికి బన్నీ మాస్ ఇమేజ్ కి రీచ్ అయ్యేలా సినిమాని తెరకెక్కించడం పెద్ద చాలెంజింగ్ టాస్క్ అని చెప్పాలి.

ఇప్పటి వరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్యామిలీ ఆడియన్స్ కి రీచ్ అయ్యే కథలతోనే ఎక్కువుగా మూవీస్ చేశారు. అతని మాటలలతో మ్యాజిక్ చేసి ఎక్కువ సక్సెస్ లు అందుకున్నారు. అలాగే త్రివిక్రమ్ సినిమా అంటే డ్రామా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు బన్నీతో చేయబోయే సినిమా కోసం ఈ బోర్డర్స్ అన్ని క్రాస్ చేసుకొని త్రివిక్రమ్ శ్రీనివాస్ రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా నార్త్ ఇండియన్ ఆడియన్స్ మైండ్ సెట్స్ ని దృష్టిలో ఉంచుకొని కథ ప్రెజెంటేషన్ ఉండాలి.

అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా హైఎండ్ లో నెవ్వర్ బిఫోర్ అనే విధంగా డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటినే నిర్మాత నాగవంశీ అయితే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేయబోయే సినిమా గురించి చూచాయగా కొన్ని హింట్స్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై రానటువంటి కథ, వరల్డ్ ని త్రివిక్రమ్ సెట్ చేస్తున్నారని తెలిపారు. రాజమౌళి గారు కూడా టచ్ చేయని స్టోరీతో చాలా గ్రాండ్ స్కేల్ లోనే మూవీ ఉంటుందని అన్నారు.

వచ్చే ఏడాది జనవరిలో ప్రోమో ఒకటి రిలీజ్ చేసి మార్చి నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. చూస్తుంటే బాక్సాఫీస్ ను తగలబెట్టే రేంజ్ లో సౌండ్ చేసే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది. బన్నీ టార్గెట్ సెట్ చేసుకున్నాడు అంటే బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించగలడని మరోసారి అర్ధమవుతుంది. ఇక సుకుమార్ ను పాన్ ఇండియా దర్శకుడిగా నిలబెట్టడంలో బన్నీ పాత్ర కూడా ఎక్కువే ఉంది. ఎందుకంటే స్క్రిప్ట్ డిజైనింగ్ నుంచి, మేకింగ్, ప్రమోషన్ ఇలా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక త్రివిక్రమ్ తో అంతకుమించిన ప్లాన్ ఏదో వేస్తున్నట్లు అర్ధమవుతుంది.

Tags:    

Similar News