ప్చ్.. ఈషా.. నివేదా.. ఇప్పుడు మీనాక్షి..!

త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో హీరోయిన్ ఛాన్స్ అంటే హీరోయిన్స్ అంతా కూడా వెంటనే ఓకే చెప్పే అవకాశం ఉంటుంది.

Update: 2024-01-12 10:30 GMT

త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో హీరోయిన్ ఛాన్స్ అంటే హీరోయిన్స్ అంతా కూడా వెంటనే ఓకే చెప్పే అవకాశం ఉంటుంది. అయితే సినిమాలో లీడ్ హీరోయిన్ గా ఛాన్స్ అంటే ఓకే కానీ సినిమాలో సెకండ్ హీరోయిన్ అంటే మాత్రం బాబోయ్ అనాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా త్రివిక్రం సినిమాల్లో సెకండ్ హీరోయిన్ అంటే అది సైడ్ క్యారెక్టర్ కన్నా దారుణంగా ఉంటుందని చెప్పొచ్చు. ఆల్రెడీ ఇదివరకు వచ్చిన సినిమాల్లో ప్రూవ్ కాగా ఈరోజు వచ్చిన గుంటూరు కారంతో మరోసారి అది ప్రూవ్ అయ్యింది.

మహేష్ హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి కూడా నటించింది. సినిమాలో ఆమె హీరో మరదలి పాత్రలో కనిపించింది. అయితే సినిమాలో ఆమెకు కేవలం ఒకటి రెండు సీన్స్ అది కూడా అంతగా రిజిస్టర్ అయ్యేవి కాదని చెప్పొచ్చు. మహేష్ సినిమాలో మీనాక్షి చౌదరి అనగానే అమ్మడితో కొన్ని సీన్స్ వీలైతే ఒక పాట ఇలా ఆశిస్తారు ఆడియన్స్. కానీ ఇవేవి లేకుండా ఒక హీరోయిన్ ని సైడ్ రోల్ చేసి పడేశాడు త్రివిక్రం శ్రీనివాస్.

ఇది కేవలం మీనాక్షి విషయంలో మాత్రమే జరిగింది కాదు. అరవింద సమేత సినిమాలో ఈషా రెబ్బ, అల వైకుంఠపురములో సినిమాలో నివేదా పేతురాజ్ ఇలా హీరోయిన్ గా ఒకరు సైడ్ రోల్ గా మరొకరు చేస్తూ వస్తున్నారు. త్రివిక్రం ఛాన్స్ అనగానే ఎగిరి గంతేయడం సినిమాలో తమది సైడ్ రోల్ అని తెలిసి ఏదో ఒకటిలే చేసేద్దామని అనుకోవడం కామన్ అయ్యింది. ఇలా త్రివిక్రం సినిమాలో సైడ్ రోల్స్ చేసినా సరే వారి కెరీర్ కు ఏమాత్రం యూస్ ఉండదన్న విషయాన్ని ఆ హీరోయిన్స్ గ్రహించాలి.

ఈషా, నివేదా ఇప్పుడు మీనాక్షి ఇలాంటి రోల్స్ లో కనిపించి ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేయడమే తప్ప వారు సాధించింది ఏమి లేదు. గురూజీ కూడా ఇలాంటి చిన్న చిన్న పాత్రలకు హీరోయిన్స్ ని తీసుకోవడం మానేస్తే బెటర్ అని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. మహేష్ గుంటూరు కారం సినిమాలో శ్రీలీల మెయిన్ హీరోయిన్ కాగా ఆమె పాత్ర కూడా ఆశించిన స్థాయిలో చూపించలేదని ఆడియన్స్ రెస్పాండ్ అవుతున్నారు. ఇక మీనాక్షి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్ అని చెప్పుకుంటున్నారు.

Tags:    

Similar News