గురూజీ మ‌ళ్లీ ఓల్డ్ మెమోరీస్ లోకి!

టైర్ -2 హీరోలు కూడా డేట్లు ఇవ్వ‌లేని ప‌రిస్థితిలో ఉన్నారు. దీంతో గురూజీ కూడా యూట‌ర్న్ తీసుకున్నారు.

Update: 2024-05-29 08:30 GMT

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ ఓల్డ్ మెమోరీస్ లోకి వెళ్తున్నారా? మేకింగ్ ని ప‌క్క‌న‌బెట్టి పూర్తిగా పెన్ను పేప‌ర్ తోనే ప‌ని అంటున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది.` గుంటూరు కారం `త‌ర్వాత త్రివిక్ర‌మ్ ఇంత‌వ‌ర‌కూ కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌టించ‌ని సంగ‌తి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా అనుకున్నారు గానీ అది ఇప్ప‌ట్లో సాధ్యం కాదు. ఇక మిగ‌తా స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు.

టైర్ -2 హీరోలు కూడా డేట్లు ఇవ్వ‌లేని ప‌రిస్థితిలో ఉన్నారు. దీంతో గురూజీ కూడా యూట‌ర్న్ తీసుకున్నారు. అన‌వ‌స‌రంగా స‌మ‌యం వృద్ధా చేయ‌డం కంటే గ‌త జ్ఞాప‌కాల్లోకి వెళ్లి కొన్నాళ్ల పాటు అక్క‌డ బిజీగా ఉంటే స‌రి అనుకుంటున్న‌ట్లు గుస గుస వినిపిస్తుంది. 20 ఏళ్ల క్రితం త్రివిక్ర‌మ్ రైట‌ర్ గా ఎంత బిజీగా ఉండేవారో చెప్పాల్సిన ప‌నిలేదు. స్టోరీ రైట‌ర్ గా..స్క్రీన్ ప్లే..డైలాగ్ రైట‌ర్ గా చాలా సినిమాల‌కు ప‌నిచేసారు. మళ్లీ ఇప్పుడు అదే ప‌ని చేయ‌బోతున్నారు.

ప్ర‌స్తుతం గురూజీ నిర్మాత‌గా కూడా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. సితార సంస్థ భాగ‌స్వామ్యంలో భార్య పేరు మీద స్థాపించిన పార్చూన్ సంస్థ‌లో సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. ఇప్పుడా బ్యాన‌ర్ల కోసం క‌థ‌లు రాస్తే స‌రి. ద‌ర్శ‌కుడిని మించిన అదాయం ఈజీగా వ‌చ్చేస్తుంది. ఇక‌పై ఆ బ్యాన‌ర్లు చేసే సినిమాల‌కు ఈ గ్యాప్ లో క‌థ‌లు అందించాల‌ని ఫిక్స్ అయ్యారుట‌. పూర్తిగా బౌండెడ్ స్క్రిప్ట్ అందించి వేరే ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేయించాల నుకుంటున్నారుట‌. ఆ ర‌కంగా చేస్తే సినిమాలో వాటా కూడా ద‌క్కుతుంది.

సొం క‌థ‌..సొంత సంస్థ‌లో క‌థ అందిస్తే హిట్ అయితే నేరుగా వాటానే ఖాతాలో జ‌మ అవుతుంది. రైట‌ర్ గా ఆయ‌న అనుభ‌వం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ర‌చ‌న గురూజీకి కొట్టిన పిండి. ఆయ‌న క‌థ‌ల‌కు మార్కెట్ లో డిమాండ్ భారీగానే ఉంటుంది. ఏడాదికి మూడు నాలుగు క‌థ‌లు ఈజీగా సిద్దం చేయ‌గ‌ల‌రు. వాట‌న్నింటిని ప‌క్కాగా ప్లాన్ చేసుకుని రిలీజ్ చేసుకోగ‌లిగితే ద‌ర్శ‌కుడిని మించిన ఆదాయం చూస్తారు. ప‌ని త‌క్కువ వేత‌నం ఎక్కువ అన్న‌ట్లు ఉంటుంది. ఇప్పుడిదే ఐడియాలో గురూజీ క‌నిపిస్తున్న‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాల నుంచి లీకులందుతున్నాయి.

Tags:    

Similar News