ట్రోల్స్ : సూపర్‌ స్టార్‌ చిన్న బుద్ది!

ఇండియాలో అత్యంత పాపులారిటీ ఉన్న హీరో నేనే అవ్వాలి, నన్ను మాత్రమే అంతా అభిమానించాలి అనే ఉద్దేశ్యంతో షారుఖ్‌ ఉంటాడు,

Update: 2023-09-17 03:56 GMT

బాలీవుడ్ బాద్‌ షా, సూపర్ స్టార్‌ షారుఖ్ ఖాన్‌ పై సౌత్ సినీ ప్రేమికులు ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ట్రోల్స్ చేస్తున్నారు. ఆయన అవ్వడానికి సూపర్‌ స్టార్‌ అయినా కూడా ఆయన బుద్ది చిన్న బుద్ది అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇతరుల విజయాలను ఓర్వలేని హీరో అతడు, ఇతరుల సక్సెస్ లను బయటకు చెప్పలేని చిన్న వ్యక్తిత్వం అతడిది అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

గతంలో కూడా షారుఖ్ గురించి ఇలాంటి విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఆ విమర్శలు రావడానికి కారణం ఏంటి అంటే... తాజాగా ఆయన నటించిన జవాన్ సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో సక్సెస్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. హీరోయిన్ దీపికా పదుకునే ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రభాస్‌ గురించి, ప్రభాస్ సినిమా గురించి మాట్లాడటం జరిగింది.

ప్రభాస్ తో కలిసి దీపికా ప్రాజెక్ట్‌ కే సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్‌ గురించి ఆమె మాట్లాడుతున్న సమయంలో పక్కనే ఉన్న షారుఖ్‌ ఖాన్‌ మొహం కవలికలు మారిపోయాయి. అతడి తీరు ఏ మాత్రం సరిగా లేదు అన్నట్లుగా ఫేస్ పెట్టాడు. అప్పటి వరకు నార్మల్ గానే ఉన్న షారుఖ్‌ ఆమె ప్రభాస్‌ ప్రస్థావన తెచ్చిన వెంటనే మారి పోయాడు.

ఇండియాలో అత్యంత పాపులారిటీ ఉన్న హీరో నేనే అవ్వాలి, నన్ను మాత్రమే అంతా అభిమానించాలి అనే ఉద్దేశ్యంతో షారుఖ్‌ ఉంటాడు, రికార్డులన్నీ కూడా తన సినిమాలకే ఉండాలి అనే కుల్లు తో అతడు ఉంటాడని తాజా ఈవెంట్ లో ఆయన్ను చూస్తే అర్థం అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవల పుష్ప సినిమా కి జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా మరియు అల్లు అర్జున్‌ జవాన్‌ సినిమా గురించి మాట్లాడిన సమయంలో షారుఖ్‌ ఖాన్‌ స్పందిస్తూ నేను పుష్ప సినిమాను మూడు సార్లు చూశాను అన్నాడు. కానీ అంతకు ముందు ఎప్పుడు కూడా పుష్ప సినిమా గురించి షారుఖ్‌ మాట్లాడిందే లేదు. అందుకే సౌత్ స్టార్స్ పై ఈగో ను పెంచుకుని షారుఖ్‌ ఖాన్‌ ప్రవర్తిస్తున్నాడు అన్నట్లుగా చాలా మంది సోషల్‌ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. మరి దీనికి షారుఖ్‌ ఖాన్ స్పందన ఏంటో చూడాలి.

Tags:    

Similar News