అనిరుద్ 'దేవర' ట్రోల్స్ - ఎన్టీఆర్ మాత్రం అదే నమ్మకం

అనిరుద్ తమిళ్ సినిమాలకి ఇచ్చిన మ్యూజిక్ తో పోల్చుకుంటే 'దేవర'పై కొంత తక్కువ ఎఫర్ట్స్ పెట్టాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Update: 2024-09-16 04:19 GMT

ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' మూవీని స్ట్రాంగ్ గా పబ్లిక్ లోకి తీసుకొని వెళ్లే పనిలో ఉన్నారు. మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే హిందీలో ప్రమోషన్స్ ని తారక్, కొరటాల శివ స్టార్ట్ చేశారు. మూవీపై ఉన్న హైప్ ని మరింత పైకి తీసుకెళ్లేందుకు ఎర్లీ ప్రమోషన్స్ మొదలెట్టినట్లు తెలుస్తోంది. తారక్ ఇమేజ్ కి 'దేవర' పెద్ద చాలెంజింగ్ టాస్క్. 'దేవర'తో కచ్చితంగా ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో కమర్షియల్ సక్సెస్ అందుకోవాల్సి ఉంటుంది. అందుకే ప్రమోషన్స్ విషయంలో తారక్ ఎక్కడా తగ్గడం లేదు.

ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్ సినిమా కంటెంట్ గురించి చెబుతూ వీలైనంత హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ పైన, యాక్టర్స్ పైన ఎన్టీఆర్ ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సందీప్ రెడ్డి వంగా 'దేవర' టీమ్ ని ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, కొరటాల శివ పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ పై ప్రశంసలు కురిపించారు.

అలాగే ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ పైన ప్రశంసలు కురిపించారు. 'దేవర' కథని అనిరుద్ చాలా బాగా అర్ధం చేసుకున్నారని ఎన్టీఆర్ అన్నారు. అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో 'దేవర' సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందించాడని కొనియాడారు. ప్రేక్షకులు కోరుకునే దానికంటే బెస్ట్ మ్యూజిక్ 'దేవర' కోసం అతను ఇచ్చాడని అన్నారు. అయితే అనిరుద్ గురించి ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

దీనికి కారణం ఉంది. 'దేవర' నుంచి వచ్చిన మూడు సాంగ్స్ ని కాపీ ట్యూన్స్ తోనే అనిరుద్ చేసాడనే విమర్శలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఒరిజినల్ సాంగ్స్ కి 'దేవర' మ్యూజిక్ ని సింక్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అలాగే దేవర ట్రైలర్ కి అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ పైన మిశ్రమ స్పందన వచ్చింది. అనిరుద్ తమిళ్ సినిమాలకి ఇచ్చిన మ్యూజిక్ తో పోల్చుకుంటే 'దేవర'పై కొంత తక్కువ ఎఫర్ట్స్ పెట్టాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అయితే ఎన్టీఆర్ మాత్రం అనిరుద్ మ్యూజిక్ పై ప్రశంసలు కురిపించారు. ఇప్పటి వరకు అయితే ఎన్టీఆర్ ప్రశంసలకి సరిపోయే విధంగా 'దేవర' మ్యూజిక్ లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా మూవీకి అనిరుద్ ఏ మేరకు సంగీతం అందించాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక వేళ 'దేవర' సినిమాకి అనిరుద్ నిజంగానే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మ్యూజిక్ ఇస్తే మాత్రం కచ్చితంగా టాలీవుడ్ లో అతని పేరు మార్మోగిపోతుంది.

Tags:    

Similar News