షాకిస్తున్న ప్రముఖ గాయని ఆస్తి ఐశ్వర్యం
అయితే రూ. 200 కోట్ల నికర ఆస్తి విలువతో భారతదేశంలోనే అత్యంత ధనిక మహిళా గాయనిగా ఉన్న తులసీ కుమార్ గురించి తెలిసింది తక్కువే.
ఇండియాలో ప్రతిభావంతులైన గాయనీమణులు ఎందరో ఉన్నారు. శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, నేహా కక్కర్ సహా పలువురు సౌత్ గాయనీమణులు భారతదేశంలోని అగ్రశ్రేణి నేపథ్య గాయకులుగా చరిత్రకెక్కారు. అయితే రూ. 200 కోట్ల నికర ఆస్తి విలువతో భారతదేశంలోనే అత్యంత ధనిక మహిళా గాయనిగా ఉన్న తులసీ కుమార్ గురించి తెలిసింది తక్కువే.
తులసి కుమార్ ప్రముఖ సినీ నిర్మాత భూషణ్ కుమార్ సోదరి. దివంగత గాయకుడు టి-సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ కుమార్తె. తన సోదరి కుశాలి కుమార్ నటి. తులసి కుమార్ నికర ఆస్తి విలువ నేటితరం ట్యాలెంటెడ్ యువగాయనీమణులు శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, నేహా కక్కర్ మొదలైన వారి మొత్తం సంపద కంటే చాలా ఎక్కువ. తులసి కుమార్ 2009లో 'లవ్ హో జాయే' ఆల్బమ్‌తో గాయనిగా కెరీర్ ప్రారంభించారు. అనేక సినిమాలకు పాడారు. వాటిలో స్కూల్ లోని ముఝే తేరీ.. బిల్లు లోని 'లవ్ మేరా హిట్'.. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై లోని 'తుమ్ జో ఆయే' లాంటి చార్ట్ బస్టర్ పాటలు ఉన్నాయి. 37 ఏళ్ల గాయని హితేష్ రాల్హాన్‌ను 2015లో వివాహం చేసుకున్నారు.
భారతదేశంలో టాప్ 10 గాయనీమణుల ఆస్తుల వివరాలు ఆసక్తిని కలిగిస్తాయి. మేటి ప్రతిభావని శ్రేయా ఘోషల్ నికర ఆస్తి విలువ రూ. 180-185 కోట్లు. సునిధి చౌహాన్ నికర ఆస్తి విలువ రూ. 100 కోట్లకు పైగా ఉండగా, ఆశా భోంస్లే నికర ఆస్తుల విలువ రూ. 80 కోట్లకు పైగా ఉన్నట్లు కథనాలొస్తున్నాయి. సింగింగ్ సెన్సేషన్ నేహా కక్కర్ ఆస్తి విలువ దాదాపు రూ.40 కోట్లు అని సమాచారం. వీళ్లందరి కంటే తులసి కుమార్ ఆస్తి విలువ చాలా ఎక్కువ.