సై అంటే సై అత‌డు అన్ని ర‌కాలుగా సిద్దం!

కొన్ని నెల‌లుగా టాలీవుడ్ ఇద్ద‌రు స్టార్ హీరోల మ‌ధ్య బిగ్ వార్ న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-09-19 07:06 GMT

కొన్ని నెల‌లుగా టాలీవుడ్ ఇద్ద‌రు స్టార్ హీరోల మ‌ధ్య బిగ్ వార్ న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. అభిమానుల మ‌ద్య ఈ యుద్దం ప‌తాక స్థాయికి చేరింది. నేరుగా హీరోలే ప‌రోక్షంగా ఢీ అంటే ఢీ అన‌డంతో? అభిమానుల మ‌ధ్య వైరం అంత‌కంత‌కు ముదురుతుంది. ఈ కార‌ణంగా త‌న సినిమా రిలీజ్ పై కూడా ప్ర‌భావం ప‌డుతుంద‌ని..ఆ కార‌ణంగానే వాయిదా వేస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రిగింది. స‌రిగ్గా ఇదే స‌మయంలో ఆ చిత్ర యూనిట్ సినిమా రిలీజ్ తేదీని ప్ర‌క‌టించి షాక్ ఇచ్చింది.

అయినా స‌రే ఆహీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా? బ‌హిష్క‌రిస్తామంటూ వ్య‌తిరేక ప్యాన్ వ‌ర్గం నుంచి హెచ్చరిక‌లు జారీ అవుతున్నాయి. ప్ర‌తీగా ఆ హీరో అభిమానులు చూసుకుందాం? అంటూ స‌వాల్ విసిరారు. పాన్ ఇండియాలో మా హీరో దూకుడు ఎలా ఉంటుందో రిలీజ్ త‌ర్వాత చూపిస్తామంటూ ఛాలెంజ్ చేసారు. దీంతో అభిమానుల ధీమాని ఆ హీరో కూడా ఛాలెంజ్ గా తీసుకుని ముందుకు క‌దులుతున్నాడు.

అభిమానులంటే ఆ హీరో ప్రాణం పెడ‌తాడు..ఫ్యాన్స్ అయ్యా? అంటూ అభిమానుల్ని హ‌త్తుకోవ‌డానికి అత‌డే మీద‌కు వెళ్తుంటాడు. అంత‌గా అభిమానుల‌పై ప్రేమ కురిపిస్తాడు. అలాంటి అభిమానుల విసిరిన ఛాలెంజ్ ను తాను సైతం స్వీక‌రించి స్ట్రాంగ్ గా మారాడు. ఇప్పుడా హీరో ఫ్యాన్ బేస్ ని అంత‌కంత‌కు పెంచుకునే పనిలో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఆ హీరోకి సోష‌ల్ మీడియా మంచి ఫోలోయింగ్ ఉంది.

ల‌క్ష‌ల్లో... కోట్ల‌లో ఫాలో వ‌ర్స్ ఉన్నారు. ఇప్పుడా సంఖ్య‌ను పెంచుకునే ప‌నులు మ‌రింత ముమ్మ‌రం చేసింద‌ట ఆర్మీ. ప్రాంతాల వారీగా అభిమానుల్ని విభ‌జించి బ‌లంపుంజుకునే చ‌ర్య‌లు చేప‌డుతు న్నారుట‌. ఇది ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. పాన్ ఇండియా వైడ్ అత‌డిని క్రేజ్ ని బేస్ చేసుకుని ఈ ర‌క‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ లో వినిపిస్తుంది. యాంటీ వర్గం నుంచి ఎలాంటి పోస్టులు వ‌చ్చినా? ప్ర‌తిగా వాటికి స్ట్రాంగ్ గా బ‌ధులిచ్చేలా కొన్ని టీమ్ లు దేశ వ్యాప్తంగా త‌యారవు తున్నాయ‌ట‌. సినిమా రిలీజ్ అనంత‌రం ఓపెనింగ్ విష‌యంలో ఎలాంటి ప్ర‌భావం ప‌డ‌కుండా ఇప్ప‌టి నుంచే ఓ ప్ర‌ణాళిక వేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

Tags:    

Similar News