బాలయ్య అన్‌ స్టాపబుల్‌.. ఇదేం క్రేజ్ రా బాబు!

ఇప్పుడు నాలుగో సీజన్.. మరికొద్ది గంటల్లో స్టార్ట్ కానుంది.

Update: 2024-10-25 10:27 GMT

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో అన్‌ స్టాపబుల్‌.. ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఆ షో.. ఇప్పటికే మూడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్.. మరికొద్ది గంటల్లో స్టార్ట్ కానుంది. ఈరోజు రాత్రి 8.30 గంటల నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. గెస్ట్ గా వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే మేకర్స్ ప్రోమోను రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ ఎపిసోడ్ ఎలా అయినా చూడాలి అనేంతగా హైప్ క్రియేట్ చేసింది. మాస్‌ లీడర్‌ తో మాస్ హీరో సందడి చూడాల్సిందే అన్నట్లు బజ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ప్రోమోలో చంద్రబాబుకు బాలయ్య అడిగిన ప్రశ్నలు ఆసక్తికరంగా ఉన్నాయి. రాజకీయాల నుంచి కుటుంబ సభ్యులతో అనుబంధాలు వరకు అన్నీ ఎపిసోడ్ లో ఉన్నట్లు కనిపిస్తుంది.

దీంతో అనేక మంది ఫస్ట్ ఎపిసోడ్ ను చూసేందుకు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో సీజ‌న్ 4 స్ట్రీమింగ్ కానున్న సందర్భంగా శుక్రవారం హాలిడే ఇవ్వాలని కొంద‌రు ఐటీ ఉద్యోగులు డిమాండ్ చేసిన పిక్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ లోని హైటెక్ సిటీ రోడ్లపై బాలయ్య ఫ్యాన్స్ ప్లకార్డులతో కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు ట్రెండ్ అవ్వగా.. అనేక మంది నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

సినిమాల రిలీజ్ కు వివిధ చోట్ల సెలవులు ఇవ్వడం పలుమార్లు చూశామని నెటిజన్లు చెబుతున్నారు. కానీ షో కోసం హాలిడే అడిగినట్లు చూడడం ఇదే ఫస్ట్ టైం అని అంటున్నారు. ఇప్పుడు షోకు ఉన్న క్రేజ్ చూస్తుంటే అన్‌ స్టాపబుల్‌ సీజన్ 4 అన్ని రికార్డులు బద్దలు కొట్టేలా కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఒకప్పుడు బాలయ్య మూవీలు రిలీజ్ అయితే విజయవాడలో అనేక విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చేవారట. ఇప్పుడు ఆయన హోస్ట్ చేస్తున్న షో కోసం హాలిడే అడగడం గమనార్హం.

Tags:    

Similar News