స్పెషల్ ఫోటో: కంగారూ బేబీని పలకరించిన బేబి క్లిన్ కారా
ఇదే గాక 15 గుర్రాలను రామ్ చరణ్ పెంచుతున్నారు. ఇవన్నీ అతడిని జంతు ప్రేమికుడిగా ప్రపంచానికి ఆవిష్కరించాయి.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు పెట్ లవర్స్ అన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో తమ కలల ఇంటి వద్ద కొన్ని పక్షులు, మూగ ప్రాణులను వారు సంరక్షిస్తున్నారు. వాటికోసం ప్రత్యేక వసతులు చేయడమే గాక నిరంతరం రక్షణ వలయాన్ని నిర్మించడం మూగ జీవాలపై వారి ప్రేమకు నిదర్శనం. చరణ్ పెట్ డాగ్ రైమ్ ఆ ఇంటి సభ్యుడిగా గారాబంగా పెరుగుతోంది. ఇదే గాక 15 గుర్రాలను రామ్ చరణ్ పెంచుతున్నారు. ఇవన్నీ అతడిని జంతు ప్రేమికుడిగా ప్రపంచానికి ఆవిష్కరించాయి.
అదంతా అటుంచితే ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసన కామినేని, క్యూట్ డాటర్ క్లిన్ కారాతో కలిసి ఆస్ట్రేలియా- మెల్బోర్న్కు ఫ్యామిలీ వెకేషన్‌కు వెళ్లారు. ఆస్ట్రేలియా వెళితే అక్కడ కచ్ఛితంగా ఒక ఫ్రెండ్ పరిచయమవుతుంది. అది క్యూట్ కంగారూ అని వేరే చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ఫోటోగ్రాఫ్ చూస్తుంటే కంగారూ బేబీతో క్లిన్ కారా పరిచయం అయిపోయిందని అర్థమవుతోంది. కంగారూ ఆస్ట్రేలియా జాతీయ జంతువు అన్న సంగతి తెలిసిందే. తనను పరిచయం చేసుకున్న ఘనత బేబి క్లిన్ కారాకే దక్కుతుంది.
కనిపిస్తున్న ఫోటోగ్రాఫ్ లో క్లిన్ కారా ముఖం చాలావరకు కనిపించడం లేదు. కానీ క్లిన్ ఈ సందర్భాన్ని ఆస్వాధించినట్టే కనిపిస్తోంది. పెట్స్, మూగ ప్రాణుల విషయంలో చరణ్, ఉపాసన దంపతుల ప్రేమ మరోసారి బయటపడింది. ఆసీస్ లో ప్రస్తుతం మెగా దంపతులను అభిమానులు కలిసేందుకు సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అదే సమయంలో ఆస్ట్రేలియాలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఈ జంట తమ గారాలపట్టీతో పాటు ఆస్వాధిస్తున్నారు. చరణ్ తదుపరి తన సినిమా గేమ్ ఛేంజర్ ని ప్రమోట్ చేసేందుకు ఉద్యుక్తుడవుతాడు. అలాగే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో సినిమాని పూర్తి చేయాల్సి ఉంటుంది.