ఉపాసనకి ఈర్ష్యగా ఉందట

తాజాగా ఒక చిట్ చాట్ లో ఉపాసన తన భర్త రామ్‌ చరణ్ మరియు కూతురు క్లీంకార మధ్య ఉండే అనుబంధం గురించి మాట్లాడింది.

Update: 2024-02-06 04:37 GMT

మెగాస్టార్‌ కోడలు, మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్ భార్య.. అంతకు ముందే కామినేని వారి ఇంటి ఆడబిడ్డ అయిన ఉపాసన కు ఎప్పుడు ఏ లోటు ఉండదు. ఆమె ఏం కోరుకుంటే అది క్షణాల్లో ఆమె ముందు ఉంటుంది. అలాంటి ఉపాసన ఒక విషయాన్ని చూసి ఈర్ష్య పడుతుందట. ప్రస్తుతం ఈ క్యూట్‌ విషయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

తాజాగా ఒక చిట్ చాట్ లో ఉపాసన తన భర్త రామ్‌ చరణ్ మరియు కూతురు క్లీంకార మధ్య ఉండే అనుబంధం గురించి మాట్లాడింది. వారిద్దరి మధ్య ఉండే బంధాన్ని చూస్తుంటే నాకు ఎంతో ఈర్ష్యగా ఉంటుంది. క్లీంకార తన తండ్రి చరణ్ ను చూడగానే నవ్వుతూ ఉంటుంది. చరణ్‌ ను చూడగానే క్లీంకార కళ్లు మెరిసి పోతాయి అంటూ ఉపాసన చెప్పుకొచ్చింది.

రామ్‌ చరణ్‌, ఉపాసన పెళ్లి అయిన తర్వాత పదేళ్లకు క్లీంకార కి జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఈ మెగా వారసురాలు రాకతో చిరంజీవి ఫ్యామిలీ లో ఆనందం వెల్లివిరిసింది. క్లీంకార పుట్టిన తర్వాత ఉపాసన మరియు రామ్‌ చరణ్ ల జీవన శైలి చాలా మారిందట.

మొత్తానికి మెగా ఫ్యామిలీ లో క్లీంకార చాలా స్పెషల్‌. ఇప్పటి వరకు క్లీంకార ఫేస్ ను అధికారికంగా రివీల్ చేయకుండా ఉంచారు. మెగా ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా క్లీంకార ఫేస్‌ ను ఎప్పుడెప్పుడు చూస్తామా అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు.

ఇక రామ్‌ చరణ్ సినిమాల విషయానికి వస్తే శంకర్ దర్శకత్వంలో గేమ్‌ చేంజర్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు బుచ్చి బాబు దర్శకత్వంలో కూడా ఒక సినిమాను రామ్‌ చరణ్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడు. గేమ్‌ చేంజర్ ను ఈ ఏడాది లో విడుదల చేయబోతున్నారు. బుచ్చి బాబు సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లేదా దసరా వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

 

Tags:    

Similar News