గ్లోబల్ స్టార్ కి థెరపిస్ట్ సర్టిఫికెట్ ఇచ్చేసిన సతీమణి..!

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె చరణ్ బెస్ట్ థెరపిస్ట్ అని అన్నారు. ఆఫ్టర్ డెలివరీ డిప్రెషన్ ని అఘిగమించడానికి చరణ్ హెల్ప్ చేశాడని చెప్పుకొచ్చారు ఉపాసన.

Update: 2024-05-14 13:30 GMT

స్టార్ హీరోలు తాము కమిటైన సినిమాలను పూర్తి చేసేందుకు ఏళ్లకు ఏళ్లు కష్టపడుతుంటారు. వందల కోట్ల బడ్జెట్ తో వందల సంఖ్యలో చిత్ర యూనిట్ పనిచేస్తున్న సినిమాకు హీరోలుగా తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని రేయింబవళ్లు కష్టపడుతుంటారు. ఈ క్రమంలో స్టార్ హీరోలు తమ ఫ్యామిలీని కూడా దూరం పెడతారు. ఏదో దొరికిన కొద్ది సమయాన్ని మాత్రమే కుటుంబానికి ఇస్తూ మిగతా టైం అంతా కూడా సినిమాలకే అంకితం చేస్తారు. అయితే కొందరు హీరోలు మాత్రం అటు సినిమాలతో పాటుగా ఫ్యామిలీకి కూడా సరైన టైం ఇస్తుంటారు.

ముఖ్యంగా అవసరమైన టైం లో వారికి తోడుగా ఉంటారు. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ రాం చరణ్ కూడా ఆయన సతీమణి ఉపాసన ప్రెగ్నెన్సీ టైం లో చాలా సపోర్టింగ్ గా ఉన్నారు. ఎక్కువగా షూటింగ్ కు వెళ్లకుండా ఆమెతోనే ఉంటూ ఆమెకు ధైర్యం చెప్పారు. అయితే ప్రసవానంతరం కూడా చరణ్ తనకు సపోర్ట్ గా నిలిచారని అంటున్నారు ఉపాసన. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె చరణ్ బెస్ట్ థెరపిస్ట్ అని అన్నారు. ఆఫ్టర్ డెలివరీ డిప్రెషన్ ని అఘిగమించడానికి చరణ్ హెల్ప్ చేశాడని చెప్పుకొచ్చారు ఉపాసన.

అంతేకాదు డెలివరీ తర్వాత మహిళలు ఎదుర్కొనే సమస్యలు గురించి ఆమె ప్రస్తావించారు. తల్లి అవ్వడం అనేది మహిళకు ఒక అద్భుతమైన ప్రయాణం. అయితే అదంత సులువైనది కాదు. ఎన్నో సవాళ్లను దాటాల్సి ఉంటుందని అన్నారు ఉపాసన. ఆఫ్టర్ డెలివరీ డిప్రెషన్ నుంచి బయట పడేందుకు సంబంధించిన డాక్టర్స్ ని సంప్రదించాలని ఆమె అన్నారు. అందరిలానే తాను కూడా ఆఫ్టర్ డెలివరీ డిప్రెషన్ కు లోనయ్యాను.. ఆ పరిస్థితుల్లో చరణ్ నాకు ఎంతో ధైర్యం చెప్పడంతో పాటుగా అండగా నిలిచాడని అన్నారు ఉపాసన.

కూతురు మీద చరణ్ చూపించే ప్రేమ శ్రద్ధ చూస్తే ముచ్చటేస్తుందని అన్నారు ఉపాసన. క్లింకారా ఎన్నో విషయాల్లో చరణ్ ని గుర్తు చేస్తుందని వాళ్లిద్దరి ఆహారపు అలవాట్లు కూడా ఒకేలా ఉన్నాయని అన్నారు ఉపాసన.

ఇక చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేం చేంజర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కుదిరితే డిసెంబర్ లేదా 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ అంతా కూడా భారీ అంచనాలతో ఉన్నారు.

Tags:    

Similar News