'భాగ్‌ సాలే' టు 'బేబీ'.. ఓటీటీలోకి రీసెంట్​ రిలీజెస్​

అలా ఇప్పుడు ఈ మధ్యలో రిలీజై ప్రేక్షకుల్ని అలరించిన పలు సినిమా లో ఓటీటీ ఆడియెన్స్​ను అలరించేందుకు సిద్ధమయ్యాయి.

Update: 2023-08-01 08:00 GMT

ఈ వేసవి నుంచి ఎక్కువ మొత్తంలో చిత్రాలు హిట్ అందుకోలేదు. నాని 'దసరా', సాయితేజ్​ 'విరూపాక్ష'తో పాటు గత నెల లో రిలీజైన 'సామజవరగమన', 'బేబీ' చిత్రాలు మాత్రమే మంచి సక్సెస్​ను అందుకున్నాయి. ఇకపోతే మరిన్ని చిత్రాలు పర్వాలేదనిపించేలా బాక్సాఫీస్ వద్ద ఆడాయి. అయితే సాధారణంగా థియేటర్లలో రిలీజైన సినిమాలన్నీ ఓటీటీ లోకి వస్తాయన్న సంగతి తెలిసిందే. అలా ఇప్పుడు ఈ మధ్యలో రిలీజై ప్రేక్షకుల్ని అలరించిన పలు సినిమా లో ఓటీటీ ఆడియెన్స్​ను అలరించేందుకు సిద్ధమయ్యాయి. అవేంటి? ఎందులో స్ట్రీమింగ్ కానున్నాయి? తెలుసుకుందాం.

సంగీత దర్శకుడు కీరవాణి తనయుడిగా ఇండస్ట్రీలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీసింహా కోడూరి. 'మత్తు వదలరా', 'తెల్లవారితే గురువారం' చిత్రాల తో ఆకట్టుకున్న ఈ హీరో.. 'భాగ్‌ సాలే'తో ఇటీవలే వచ్చి భారీ డిజాస్టర్​ను అందుకున్నాడు. ప్రణీత్‌ సాయి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నెట్​ఫ్లిక్స్​లో ఆగస్ట్​ 7నుంచి అందుబాటు లో ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందింది.

'జీనియస్‌', 'రాజుగారి గది 2', 'రాజుగారి గది 3' సహా పలు చిత్రాల తో ఆకట్టుకున్న నటుడు అశ్విన్‌బాబు. రీసెంట్​గా అనిల్‌ కృష్ణ దర్శకత్వంలో హిడింబ చిత్రంతో ఆడియెన్స్​ ముందుకు వచ్చి హిట్ అందుకున్నారు. ఈ చిత్రం ఆహాలో త్వరలోనే(ఈ నెల) స్ట్రీమింగ్ కానుంది.

రామాయణం ఆధారంగా అత్యున్నత సాంకేతికతతో దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన సినిమా ఆదిపురుష్. ప్రభాస్‌ రాముడిగా నటించారు. సీత గా హీరోయిన్‌ కృతిసనన్‌ కనిపించారు. ఈ చిత్రం మంచి వసూళ్లనే అందుకున్నప్పటికీ.. డిజాస్టర్ టాక్​ను అందుకుంది. విపరీతంగా విమర్శలను అందుకుని సోషల్​మీడియా లో బాగా ట్రోల్ అయింది. ఈ చిత్రం ఆగస్ట్ రెండు లేదా మూడో వారంలో రావొచ్చు.

ఇటీవలే చిన్న సినిమాగా వచ్చి దాదాపు 70కోట్లకు పైగా వసూళ్లను అందుకున్న కల్ట్ క్లాసిక్ హిట్​ చిత్రం 'బేబీ'. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన ఈ చిత్రం ఇంకా థియేటర్​లో నడుస్తోంది. ఈ చిత్రాన్ని ఆహాలో ఆగస్ట్​ 18నుంచి అందుబాటు లో ఉంచనున్నారని తెలిసంది. ఇకపోతే ఇప్పటికే డిజాస్టర్లుగా నిలిచిన నిఖిల్ స్పై, నాగశౌర్య రంగబలి .. అమెజాన్​, నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Tags:    

Similar News