వరుణ్, దుల్కర్, ధనుష్.. ముగ్గురు కూడా!

ఇప్పుడు సెట్స్ పై ఉన్న టాలీవుడ్ అప్ కమింగ్ మూవీస్ లక్కీ భాస్కర్, మట్కా, కుబేర కోసం నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. మూడు చిత్రాల థీమ్ ఒకటేనని ఇప్పుడు నెటిజన్లు అంటున్నారు.

Update: 2024-06-23 06:47 GMT

సాధారణంగా ఏ సినిమా కోసం అయినా స్టోరీ పాయింట్ రాసే ముందు చాలా వరకు వైవిధ్యంగా ఉండేలా రచయితలు చూసుకుంటారు. రొటీన్ కథ కాకుండా ఏదైనా కొత్త స్టోరీని సిద్ధం చేసుకుంటేనే సినిమాపై బజ్ క్రియేట్ అవుతుందని డైరెక్టర్స్ నమ్ముతారు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఒక్కోసారి పలు సినిమాల్లో కామన్ పాయింట్స్ ఉండడం సహజం. ఇలా ఇప్పటికే చాలా సార్లు జరిగిన విషయం తెలిసిందే.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి, స్టార్ హీరో సూర్య కంగువలో కామన్ పాయింట్ ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. రెండు సినిమాల బ్యాక్ డ్రాప్ లు వేర్వేరు అయినా.. టైం ట్రావెల్ కు రిలేటెడ్ గా తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు సెట్స్ పై ఉన్న టాలీవుడ్ అప్ కమింగ్ మూవీస్ లక్కీ భాస్కర్, మట్కా, కుబేర కోసం నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. మూడు చిత్రాల థీమ్ ఒకటేనని ఇప్పుడు నెటిజన్లు అంటున్నారు.

ఆ మూడు సినిమాలు.. డబ్బు, డబ్బు దొంగలించడం, బ్లాక్ మనీ అంశాల చుట్టూ తిరుగుతాయని చెబుతున్నారు. వెంకీ అట్లూరి, దుల్కర్ సల్మాన్ కాంబోలో వస్తున్న లక్కీ భాస్కర్ సినిమాలో హీరో.. తాను ఉద్యోగం చేస్తున్న బ్యాంక్ లో ఊహించని పని ద్వారా రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోతాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న మట్కా మూవీ అంతా నల్లధనం, అవినీతి పరిస్థితుల చుట్టూ తిరుగుతోంది.

లక్కీ భాస్కర్, మట్కా సినిమాలు.. వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగుతాయి. అయితే ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న కుబేర మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. సంపదతో పాటు అధికారాన్ని దక్కించుకునేందుకు నల్లధనం ప్రపంచంలోకి వెళ్లి మునిగిపోయే వ్యక్తి కథతో కుబేర మూవీ రూపొందుతోంది. దీంతో మూడు సినిమాలు కూడా డబ్బు జోనర్ లోనే తెరకెక్కుతున్నా.. ఓ మూవీ కథ దానిదే.

ఇక ఈ మూడు సినిమాల విషయానికొస్తే.. ఇటీవల మట్కా మూవీ షూటింగ్ రీస్టార్ట్ అయింది. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్ లో కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు మేకర్స్. లక్కీ భాస్కర్, కుబేర సినిమాల షూటింగ్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. లక్కీ భాస్కర్ సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. మిగతా రెండు వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఈ మూడు సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.

Tags:    

Similar News