పుష్ప 2… ఓటీటీ స్ట్రీమింగ్ ఇప్పట్లో లేనట్లే

ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ కూడా త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా నడుస్తోంది.

Update: 2024-12-21 07:19 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ వరల్డ్ వైడ్ గా 1500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని క్రాస్ చేసింది. హిందీలో కూడా ఈ మూవీ వసూళ్లు 650 కోట్లకి దగ్గరగా ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా ఈ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ జోరుని ఇప్పట్లో ఎవరు ఆపలేరని ట్రేడ్ పండితులు అంటున్నారు. ముఖ్యంగా హిందీలో 800 కోట్ల మార్క్ కలెక్షన్స్ ని ఈ చిత్రం టచ్ చేయొచ్చని అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే సౌత్ ఇండియాలో రిలీజ్ అయిన చాలా సినిమాలు 30 రోజుల్లోపే ఓటీటీలో ప్రేక్షకుల ముందుకి వచ్చేస్తున్నాయి. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలని తక్కువ టైంలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసుకునే విధంగా ఆ సంస్థలు ఒప్పందం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ కూడా త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా నడుస్తోంది. అయితే ఈ వార్త ఎక్కువగా వైరల్ అయితే థియేటర్ కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో మేకర్స్ తొందరగానే అలెర్ట్ అయ్యారు. ఓటీటీలో రిలీజ్ ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ 56 రోజుల లోపు ఓటీటీలోకి వచ్చే అవకాశం లేదని తేల్చేశారు. బిగ్గెస్ట్ హాలిడే టైంలో ‘పుష్ప 2’ని బిగ్ స్క్రీన్ లో చూసి ఆస్వాదించాలని చెప్పారు. ఓటీటీలో రిలీజ్ గురించి సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. థియేటర్స్ లో మాత్రమే ఈ చిత్రాన్ని ఇప్పుడు ఆస్వాదించగలరని చెప్పారు.

దీంతో ఈ రూమర్స్ కి ఎండ్ కార్డ్ పడింది. నార్త్ ఇండియాలో మల్టీప్లెక్స్ లలో రిలీజ్ చేయాలంటే 8 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలనే నిబంధన ఉంది. ‘పుష్ప 2’ మూవీ ఆ రూల్స్ ప్రకారమే నార్త్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ఏకంగా 250 కోట్లకి కొనుగోలు చేసింది. కచ్చితంగా యాప్ లో ఈ మూవీకి మంచి ఆదరణ వస్తుందని స్ట్రీమింగ్ కంపెనీ ఎక్స్ పెక్ట్ చేస్తోంది.

‘పుష్ప 2’ చిత్రానికి థియేటర్స్ లో మంచి ఆదరణ వస్తోన్న నేపథ్యంలో ఈ కలెక్షన్స్ హోల్డ్ చేసే ఉద్దేశ్యం మేకర్స్ కి కూడా లేనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా ద్వారా వీలైనంత ఎక్కువ కలెక్షన్స్ రాబట్టాలని అనుకుంటున్నారు. ఇది కూడా ఓటీటీ రిలీజ్ ని లేట్ చేయడానికి ఒక కారణం అని అనుకుంటున్నారు.

Tags:    

Similar News