గుంటూరు కారం మ్యూజిక్ గోల.. ఓ ప్లాన్ సెట్టయ్యింది
మహేష్ బాబు మాత్రం ఇంకా మంచి కంటెంట్ కావాలి అనే కోరుకుంటున్నాడు.
మహేష్ బాబు, గుంటూరు కారం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా మొదట థమన్ ను సెలెక్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తర్వాత మహేష్ బాబు అతను ఇచ్చిన ట్యూన్స్ పై అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆ తర్వాత థమన్ ను ఉంచాలా తీసేయ్యాలా అనే చర్చలు కూడా గట్టిగానే నడిచాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం థమన్ మీద నమ్మకంతో తీసేయడానికే అయితే ఆసక్తిని చూపించలేదు.
ఏదేమైనప్పటికీ మహేష్ బాబు కాస్త అసంతృప్తితోనే ఈ సినిమా కు ఎక్కువగా గ్యాప్ ఇచ్చినట్లు కూడా టాక్ వచ్చింది. ఇక మొత్తానికి ఇటీవల తన ఫ్యామిలీ తో కలిసి హాలిడే ట్రిప్ అంటూ సినిమా షెడ్యూల్ కు పెద్ద గ్యాప్ అయితే ఇచ్చాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరో లేకపోయినా కూడా కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ను షూట్ చేసే పని పెట్టుకున్నాడు.
సినిమా కు సంబంధించిన మ్యూజిక్ విషయం లో అయితే అనేక రకాల రూమర్స్ వినిపించాయి. థమన్ స్థానం లో మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ వాహిబ్ ను సెలెక్ట్ చేసుకోవాల ని అనుకున్నారు అని టాక్ వచ్చింది. అలాగే మధ్యలో ఒకటి లేదా రెండు పాటల కోసం ధమాకా మ్యూజిక్ డైరెక్టర్ నేమ్ కూడా అనుకున్నట్లుగా కథనాలు వెలువడ్డాయి.
అయితే ఇప్పుడు మొత్తానికి థమన్, త్రివిక్రమ్ చర్చలు జరిపి సమస్యను సాల్వ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఒకవైపు షూటింగ్ జరుపుతూనే మరొకవైపు త్రివిక్రమ్ థమన్ తో కలిసి సిట్టింగ్స్ వేసినట్లు సమాచారం. రోజు ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు గ్యాప్ లేకుండా మ్యూజిక్ విషయం లో చర్చలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని ట్యూన్స్ విన్న త్రివిక్రమ్ బాగానే సంతృప్తి చెందినట్లు సమాచారం. అయితే త్రివిక్రమ్ అనుకున్నంత మాత్రాన మహేష్ బాబు ఒప్పుకుంటాడా లేదా అనేది కూడా పెద్ద కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తోంది.
ఇక మళ్ళీ మహేష్ బాబు కూడా వీరి సిట్టింగ్స్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా త్రివిక్రమ్ అయితే థమన్ ను వదులుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మహేష్ బాబు మాత్రం ఇంకా మంచి కంటెంట్ కావాలి అనే కోరుకుంటున్నాడు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ మరోసారి ఎక్కువ సమయాన్ని మ్యూజిక్ కోసం కేటాయిస్తున్నాడు. ఇక ట్యూన్స్ ఫైనల్ అయితే సాంగ్స్ ని షూట్ చేయాలి అని అనుకుంటున్నారు. మరి మహేష్ బాబు ఏ విధంగా సంతృప్తి చెందుతారో చూడాలి.