అబ‌ద్ధానికే ప్ర‌చారం అవ‌స‌రం మ‌న‌కెందుకు? ఈ ఉపేంద్ర మార‌డు?

ముఖ్యంగా నిర్మాత‌లు దిగాలైపోతున్నారు. త‌ట్టుకోలేక నేరుగా ఉపేంద్ర ద‌గ్గ‌రికే వెళ్లి ఈ విష‌యంపై నిల‌దీశారు. క‌నీసం ఒక టీజ‌రో పోస్ట‌రో వేస్తేనే కదా ప్ర‌జ‌ల‌కు తెలిసేది.

Update: 2023-08-28 16:57 GMT

సినిమాకి టైటిల్ పెట్ట‌డు. ప్ర‌చారం జోలికి వెళ్ల‌డు. ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ఏదీ రిలీజ్ చేయ‌డు. ఈయ‌నింతే ఇక మార‌డు!! క‌నీసం ఏదో ఒక గ్లింప్స్ రిలీజ్ చేస్తేనే క‌దా జ‌నాల‌కు తెలిసేది. కానీ వీట‌న్నిటినీ చెత్త కార్యాలుగా తీసిపారేశాడు ఉప్పీ అలియాస్ ఉపేంద్ర‌. ఈ హిట్ లు లైక్ లు క్లిక్ లు అంటే త‌న‌కు ప‌డ‌ద‌ని అన్నాడు. వాస్త‌వానికి తొలి నుంచి అతడి పంథాయే వేరు. లోకానికి వ్య‌తిరేకంగా అంద‌రికీ ఎదురెళుతూ రొటీన్ కి దూరంగా ఇంకేదో చేయ‌డం అత‌డి హాబీ.

A, ఓం, ఉపేంద్ర అంటూ న‌చ్చిన‌ట్టు త‌న సినిమాల‌కు టైటిళ్లు పెట్టుకున్నాడు. అవ‌న్నీ బంపర్ హిట్లు. తెలుగులోను బాగా ఆడాయి. సూప‌ర్ (క‌న్న‌డ‌) లాంటి పాన్ ఇండియా చిత్రాన్ని రెండు ద‌శాబ్ధాల క్రిత‌మే తెర‌కెక్కించిన మేధావి ఉపేంద్ర‌. అలాంటి వాడు ఇప్పుడు ఒక కొత్త ప్ర‌య‌త్నం చేస్తున్నాడు అంటే స‌ర్వ‌త్రా ఆసక్తి నెల‌కొంటుంది. ఇంత‌కుముందే 'క‌బ్జా' లాంటి భారీ మ‌ల్టీస్టార‌ర్ లో న‌లుగురిలో ఒక‌ హీరోగా న‌టించాడు. కానీ అది పాన్ ఇండియా లెవ‌ల్లో ఆశించినంత‌గా ఆడ‌లేదు. అయితే ద‌ర్శ‌కుడిగా అత‌డికి చాలా గ్యాప్ వ‌చ్చింది.

దాదాపు 8 సంవత్సరాల విరామం తర్వాత ఉపేంద్ర UI (నామ మాత్రపు టైటిల్)తో దర్శకత్వ పాత్రలో తిరిగి అడుగుపెట్టారు. ఈ ప్రాజెక్ట్ ఏడాదిన్నర క్రితం ప్రకటించారు. కానీ ఈ స‌మ‌యంలో ఎలాంటి అప్‌డేట్‌లు లేకపోవడం అభిమానుల్ని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. ముఖ్యంగా నిర్మాత‌లు దిగాలైపోతున్నారు. త‌ట్టుకోలేక నేరుగా ఉపేంద్ర ద‌గ్గ‌రికే వెళ్లి ఈ విష‌యంపై నిల‌దీశారు. క‌నీసం ఒక టీజ‌రో పోస్ట‌రో వేస్తేనే కదా ప్ర‌జ‌ల‌కు తెలిసేది. రిలీజ్ ముందు క‌నీసం హైప్ అయినా వ‌స్తుంది! అంటూ చాలా బ‌తిమాలారు. కానీ దానికి ఉప్పీ త‌న‌దైన శైలిలో జ‌వాబులిచ్చి క‌న్నీళ్లు పెట్టించాడు. ఈ మొత్తం వీడియో ఎంతో ఫన్నీగా ఉంది. ఇంత‌కీ ఈ సినిమా టైటిల్ ఏమిటి? అంటే.. అదేదో లోగో మాత్ర‌మే క‌నిపిస్తోంది కానీ ఇదీ టైటిల్ అని క‌చ్ఛితంగా చెప్ప‌లేం. లోగో రూపాన్ని బ‌ట్టి UI అనే రెండ‌క్ష‌రాల్ని వ‌ర్కింగ్ టైటిల్ గా వాడేస్తున్నారు త‌ప్ప ఈ సినిమాకి టైటిల్ అంటూ ఏదీ లేదు.

ఇటీవ‌లి కాలంలో సింగిల్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్‌లను రివీల్ చేసే సంప్రదాయాన్ని తూల‌నాడుతూ ఉప్పీ చాలా తెలివిగా ప్ర‌మోష‌న్స్ ని స్టార్ట్ చేసాడు. ఈ వీడియో ఫుటేజీలో నిజంగా అసాధారణమైన సినిమా కోసం విస్తృతమైన ప్రమోషన్ల ఆవశ్యకత గురించి ప్రశ్నలను లేవనెత్తుతూ నిర్మాతలను బెంబేలెత్తించాడు. ఒక మంచి సినిమాకి ప్ర‌చారం అస‌వ‌రం లేదు అని కూడా అన్నాడు. అబ‌ద్ధానికే ప్ర‌చారం అవ‌స‌రం.. మ‌న‌కెందుకు? అని కూడా ఉప్పీ వాదించాడు. ఏది ఏమైనా ప్ర‌చారంలో ఈ అసాధారణ వ్యూహం ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా, మూవీ కోసం ఎదురుచూసేలా చేస్తోంది.

లహరి ఫిల్మ్స్ - వీనస్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌లపై ఈ పాన్ ఇండియన్ సినిమా తెర‌కెక్కుతోంది. జి మనోహరన్ - కెపి శ్రీకాంత్ దీనికి నిర్మాత‌లు. క‌థానాయిక సహా ఇత‌ర న‌టీన‌టులు సిబ్బందికి సంబంధించిన వివరాలను వెల్ల‌డించ‌లేదు. ఉపేంద్ర తెలివైన ప్ర‌మోష‌న‌ల్ వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారుతోంది. ప్రచారంలో మునుముందు ఇలాంటి ట్విస్టులు ఇంకా ఎన్ని ఉన్నాయో చూడాలి.

Full View
Tags:    

Similar News