సంచ‌ల‌న న‌టుడి సినిమా ఈసారి పెను తుఫానే!

ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఉపేంద్ర ఫ‌స్ట్ లుక్...ప్ర‌చార చిత్రాల‌తో సినిమాపై అంచ‌నాలు తారా స్థాయికి చేరాయి.

Update: 2024-11-21 09:00 GMT

క‌న్న‌డ స్టార్ ఉపేంద్ర ప్ర‌ధాన పాత్ర‌లో స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో 'యూఐ' అనే చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల గ్యాప్ అనంత‌రం ఉప్పీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమా ఇది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఉపేంద్ర ఫ‌స్ట్ లుక్...ప్ర‌చార చిత్రాల‌తో సినిమాపై అంచ‌నాలు తారా స్థాయికి చేరాయి. ఉపేంద్ర మార్క్ చిత్రంగా నిలుస్తుంద‌నే అంచ‌నాలున్నాయి. టాలీవుడ్ లో మంచి కంబ్యాక్ మూవీ అవుతుంద‌ని ఆశిస్తున్నారు.


ఇందులో ఉపేంద్రకు జోడీగా రీష్మా నానయ్య న‌టిస్తోంది. ఈ చిత్రానికి `కాంతర` ఫేమ్‌ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండ‌టం మ‌రో విశేషం. ఇప్ప‌టికే రిలీజ్ అయిన గ్లింప్స్ తోనే అజ‌నీష్ లోక్ నాధ్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన‌ట్లే క‌నిపిస్తుంది. ప్ర‌చార చిత్రాల‌తో అంత‌కంత‌కు హైప్ క్రియేట్ అవుతుంది. తాజాగా ఈ సినిమా తెలుగు రిలీజ్ హ‌క్కుల‌ను పాపులర్‌ డిస్ట్రిబ్యూషన్ హౌస్‌ అల్లు అరవింద్‌ సారథ్యంలోని గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్‌ సొంతం చేసుకుంది.

ఈ తుఫాను గతంలో ఎన్నడూ లేనంత పెద్దదిగా ఉండబోతుంది.. అంటూ షేర్ చేసిన తాజా వార్తతో ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఉపేంద్ర అశ్వంపై యుద్దవీరుడిలా కనిపిస్తున్న లుక్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. ఉపేంద్ర ఆహార్యం, బాడీ షేప్ ప్ర‌తీది కొత్త‌గా ప్ర‌జెంట్ చేస్తుంది. క‌ళ్ల‌లో రౌద్రం..జుల‌పాల జుట్టు..చేతికి రుద్రాక్ష‌లు ప్ర‌తీది ఉప్పీలో కొత్త న‌టుడ్ని ప‌రిచ‌యం చేస్తున్న‌ట్లే క‌నిపిస్తుంది.

ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్ గా మారింది. పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇక సినిమా రిలీజ్ ఇప్ప‌టికే జ‌ర‌గాలి. కానీ అనివార్య కార‌ణాల‌తో డిలే అయింది. ఎట్టకేల‌కు అన్ని ర‌కాల ప‌నులు పూర్తి చేసుకుని డిసెంబ‌ర్ 20న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.

Tags:    

Similar News