చీర‌లో సీనియ‌ర్ న‌టి మ‌తి చెడే అందం

హాఫ్ సెంచ‌రీ ఏజ్ లోను ఊర్మిల అందం ఇప్పుడు యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఊర్మిల చీర‌లో ముగ్ధ‌మ‌నోహ‌ర రూపంతో ఆక‌ర్షించింది.

Update: 2024-02-27 20:13 GMT

మోడ్ర‌న్ ఔట్ ఫిట్‌లో.. చీర‌ల్లో .. చిట్టి పొట్టి నిక్క‌ర్ల‌లో .. బికినీలో.. స్విమ్ సూట్ల‌లో ఏ విధంగా చూసినా సీనియ‌ర్ న‌టి ఊర్మిలా మ‌టోండ్క‌ర్ ఒక కిక్కు. ప‌రువాల‌తో మ‌త్తు చ‌ల్ల‌డంలో ఊర్మిల త‌ర్వాతే. రంగీలా చిత్రంలో ఊర్మిల‌లోని చాలా కోణాల‌ను యువ‌త‌రం ఇప్ప‌టికీ మ‌ర్చిపోలేరు. స‌త్య‌లో ఒక‌లా .. భార‌తీయుడులో ఇంకోలా.. దౌడ్ లో మ‌రోలా ర‌క‌ర‌కాల కోణాల్లో ఊర్మిల యువ‌త‌రం హృద‌యాల్ని చిద్రం చేసింది.

 

హాఫ్ సెంచ‌రీ ఏజ్ లోను ఊర్మిల అందం ఇప్పుడు యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఊర్మిల చీర‌లో ముగ్ధ‌మ‌నోహ‌ర రూపంతో ఆక‌ర్షించింది. సిల్వ‌ర్ మెరుపుల‌ డిజైన‌ర్ చీర‌లో ఊర్మిల చాలా స్పెష‌ల్ గా క‌నిపించింది. ఈ అంద‌మైన చీర‌కు ముత్యాల అల్లిక ఎంతో స్పెష‌ల్‌గా కుదిరింది. శారీ ల‌వ్ ఫ‌రెవ‌ర్! అంటూ అంద‌మైన క్యాప్ష‌న్ ని ఊర్మిల ఇచ్చారు. మ‌నీష్ మ‌ల్హోత్రా దీనిని డిజైన్ చేసారు. ప్ర‌స్తుతం ఊర్మిల చీర లుక్ పై అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తిరిగి రంగీలా రోజుల‌ను గుర్తు చేసుకుంటున్నారు.

25 సంవ‌త్స‌రాల కౌన్..

ఊర్మిల న‌టించిన 'కౌన్' రిలీజై నేటితో 25 సంవ‌త్స‌రాలు పూర్త‌యింది. కౌన్ అంటే ఎవ‌రు? అంత‌గా భ‌య‌పెడుతోంది? ఊర్మిళతో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన సినిమాలన్నింటిలోకెల్లా భయానక అనుభూతిని మిగిల్చే చిత్ర‌మిది. నిజానికి ఊర్మిళ అత‌డితో పనిచేయడం మానేసిన తర్వాత, రాము సినిమాలు అన్ని హార‌ర్ జాన‌ర్‌కి మారాయి.

ఇప్పుడు కూడా 'కౌన్‌'లో తనను తాను చూసి భయపడుతున్నానని ఊర్మిళ అన్నారు. పాత్ర చాలా ట్విస్ట్ ల‌తో ఉంటుంది. ఆ పేరులేని అమ్మాయిని కనుగొనడానికి చాలా లోతైన విష‌యాల్ని త‌వ్వాల్సి వచ్చింది. ఆమె ఎవరు? ఆమె ఎందుకు అలా ఉంది? హీరోయిన్‌లు ఇలాంటి పాత్రలు కూడా చేస్తారా? ఇది నిషిద్ధం క‌దా? అనుకునే సమయంలో ఒక మంచి క‌థ‌, మంచి పాత్ర సినిమాపై ఉన్న ప్రేమ కార‌ణంగా న‌టించాను. కౌన్ ఎల్లప్పుడూ దాని టైమ్ కంటే ముందుండే సినిమా.. ఇప్పటికీ ఇది నిరూప‌ణ అవుతోంది.. అని ఊర్మిల అన్నారు.

Tags:    

Similar News