స్టార్ నటి కూతురు ఇలా షాక్ ఇచ్చిందేంటి..?

హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఊర్వశి తన ఫాం కొనసాగిస్తున్నారు.

Update: 2024-10-16 19:30 GMT

సౌత్ సినీ పరిశ్రమలో సీనియర్ నటి ఊర్వశి ఎంత పాపులారిటీ సంపాధించిందో తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఐతే ఊర్వశికి మంచి క్రేజ్ ఉంది. సొంత భాష తమిళ్ అయినా తెలుగులో కూడా ఊర్వశికి తగిన పాత్రలు వస్తుంటాయి. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఊర్వశి తన ఫాం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఊర్వశి అమాయకమైన తల్లి పాత్రలో అదరగొట్టేస్తుంది. ఆమె ఎమోషనల్ సీన్స్ కూడా అదిరిపోతాయి.

ఇదిలాఉంటే ఊర్వశి వారసురాలిగా కుంజిత ఫోటోస్ చూస్తే ఆమె వారసత్వాన్ని తీసుకునేందుకు సిద్ధమని అనుకున్నారు. కుంజత ఎక్కడ కనిపించినా సరే సినిమాల్లోకి ఎప్పుడు వస్తారని అడుగుతారు. ఊర్వశితో పాటు కుంజత సోషల్ మీడియా ఫోటోస్, వీడియోస్ లో ఫాలోవర్స్ ఆమె సినీ ఎంట్రీపై ఆసక్తి గా ఉంటారు. కానీ కుంజిత మాత్రం సినిమాల్లోకి రావాలని అనుకోవట్లేదట.

ఈమధ్యనే ఆమె కిక్ బాక్సింగ్ లో చేరింది. తన కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్న ఫోటోలను షేర్ చేసింది. కుంజత కేవలం సెల్ఫ్ ప్రొటక్షన్ కోసమే బాక్సింగ్ చేస్తుందా లేదా నిజంగానే ఆ కెరీర్ ఎంచుకుందా అన్నది తెలియాల్సి ఉంది. ఓ పక్క కుంజత గ్లామర్ ఫోటోస్ చూసి ఆమెను హీరోయిన్ మెటీరియల్ అని ఆడియన్స్ అంటుంటే ఆమె మాత్రం బాక్సింగ్ పై ఇంట్రెస్ట్ చూపిస్తుంది.

అప్పుడప్పుడు తల్లి ఊర్వశితో కుంజత కూడా సినిమా వేడుకలకు వస్తుంది. అప్పుడు ఆమెను చూసి తెరంగేట్రం చేస్తే బాగుంటుందని అనుకుంటారు. ఐతే ప్రస్తుతం కుంజత ఆలోచన అయితే సినిమాల మీద లేకపోయినా రాబోయే రోజుల్లో అయినా ఆమె తెర మీదకు వస్తుందా అన్నది చూడాలి. ఊర్వశి తరహాలో మంచి స్కోప్ ఉన్న పాత్రలు చేస్తే మాత్రం కుంజతకు మంచి కెరీర్ ఉంటుందని చెప్పొచ్చు.

నటీనటుల వారసులు సినిమాల్లోకి రావడం కొత్తేమి కాదు. కానీ వాళ్ల సక్సెస్ విషయంలో ఎవరు ఏమి చేయలేరు. కానీ ఊర్వశి కూతురు కుంజత సినిమాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా కనిపిస్తుంది. ఐతే ఎవరైనా ఆసక్తి లేకపోతే ఏమి చేయలేరు. ఒకవేళ ఆమె కూడా నటిస్తా అంటే అప్పుడు అవకాశాల గురించి ఆలోచించే ఛాన్స్ ఉంటుంది. మరి కుంజత కూడా సినిమాలు చేస్తుందా ఆమెను ఒప్పించే ప్రయత్నం చేస్తారా అన్నది చూడాలి.

Tags:    

Similar News