బ‌ర్త్ డే పార్టీలో భామ‌ల కౌగిలింత‌లు గిలిగింత‌లు

నేడు ఆకాంక్ష రాంజ‌న్ క‌పూర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా పార్టీలో బెస్ట్ ఫ్రెండ్ వాణీక‌పూర్ ఎంతో చిల్లింగ్ గా క‌నిపించింది. త‌న స్నేహితురాలిని విడిచి క్ష‌ణ‌మైనా ఉండ‌లేక‌పోయింది.

Update: 2023-09-19 02:30 GMT

అంద‌మైన భామ‌లు.. లేత మెరుపు తీగ‌లు.. ముట్టుకుంటే మాసిపోయే క‌న్నెల అందాలు...!! మ‌న్మ‌ధుడు సినిమాలోని రొమాంటిక్ సాంగ్ ఇది. ఇక్క‌డ అమ్మాయిల విలాసాలు రోమాంచితంగా క‌నిపిస్తున్నాయ్. ఇలా చూడ‌గానే.. ఆ నులివెచ్చ‌ని కౌగిలిలో గిలిగింతలేల‌ స‌ఖీ..? అంటూ యూత్ ఒక‌టే ఫిదా అయిపోతున్నారు. ఇంత‌కీ ఓ రేంజులో హంగామా సృష్టించిన ఈ అంద‌మైన‌ అమ్మాయిలు ఎవ‌రు? అన్న‌ది ఆరా తీస్తే.. వార్ బ్యూటీ వాణీక‌పూర్.. త‌న స్నేహితురాలు ఆకాంక్ష రాంజ‌న్‌తో క‌లిసి ఇలా ర‌చ్చ చేసింది.


నేడు ఆకాంక్ష రాంజ‌న్ క‌పూర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా పార్టీలో బెస్ట్ ఫ్రెండ్ వాణీక‌పూర్ ఎంతో చిల్లింగ్ గా క‌నిపించింది. త‌న స్నేహితురాలిని విడిచి క్ష‌ణ‌మైనా ఉండ‌లేక‌పోయింది. బ‌ర్త్ డే పార్టీలో వాణీ-ఆకాంక్ష జోడీ షో స్టాప‌ర్స్ గా నిలిచారు. ఇక ఇదే వేడుక‌లో ఆలియా భ‌ట్, మ‌లైకా అరోరాఖాన్ స‌హా ప‌లువురు టాప్ సెల‌బ్రిటీల సంద‌డి ప్ర‌ధాన హైలైట్ గా నిలిచింది. ఇండ‌స్ట్రీ ఫ్రెండ్స్ కోసం ఈ పార్టీని అత్యంత గ్రాండ్ గా లావిష్ గా ప్లాన్ చేసింది ఆకాంక్ష‌. ఆ విష‌యం అక్క‌డ‌ యాంబియెన్స్ చూస్తుంటేనే అర్థ‌మైపోతోంది.

ఇటీవ‌ల‌ వాణీకపూర్ పుట్టినరోజు వేడుక‌ల్లో ఆకాంక్ష సంద‌డి అంతా ఇంతా కాదు. 34 ఏళ్ల వాణీ వాస్తవానికి త‌న‌ స్నేహితురాలు అయిన‌ న‌టి కం మోడల్ అనుష్క రంజన్ లేనిదే క్ష‌ణ‌మైనా ఉండ‌లేదు. నా ఎటర్నల్ సన్‌షైన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు అని అనుష్క రాంజ‌న్ అప్ప‌ట్లో ఎంతో ప్రేమ‌ను కురిపించింది. నా అందమైన పడుచుపిల్ల పుట్టినరోజు.. మీరు ఈ ప్రపంచానికి అర్హులు.. అంటూ పోయెట్రీ కూడా చెప్పింది ఆకాంక్ష‌. ఆ ఇరువురి స్నేహం అన్నివేళ‌లా అంద‌రికీ స్ఫూర్తిదాయకం.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... వాణీ క‌పూర్ న‌టించిన 'చండీగఢ్ కరే ఆషికి' , 'షంషేరా' త‌న‌కు ఎంతో మంచి పేరును తెచ్చాయి. ఈ సినిమాల్లో వాణీ అద్భుతంగా న‌టించింది. దినేష్ విజన్ ప్రాజెక్ట్ ... అషిమ్ అహ్లువాలియాతో అలాగే మరొకటి నిఖిల్ అద్వానీ ప్రొడక్షన్స్ తో సినిమాలు చేస్తోంది. ఇటీవ‌ల ప‌లువురు ద‌ర్శ‌కులు వినిపించిన క‌థ‌లు విన్న వాణీ వాటికి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వాల్సి ఉందిట‌. మ‌రోవైపు ఆకాంక్ష రాంజ‌న్ వ‌రుస‌గా మోడ‌లింగ్ అసైన్ మెంట్స్ తో బిజీగా ఉంది. గిల్టీ - మోనిక ఓ మై డార్లింగ్ చిత్రాల్లో న‌టించిన ఈ భామ పెద్ద తెర‌పై మ‌రింత‌గా వెలుగులు విర‌జిమ్మాల‌ని ప్ర‌య‌త్నాల్లో ఉంది.

Tags:    

Similar News