వైష్ణవికి మెగా అండదండలు కొలిసొచ్చేనా?
ఇంతవరకూ ఏ తెలుగు నటి ని మెగా నటులంతా ఇంతగా ప్రోత్సహించలేదు.
'బేబి' విజయంతో వైష్ణవి పేరు సోషల్ మీడియాలో మార్మోమ్రోగిపోతున్న సంగతి తెలిసిందే. ఆమె పాత్రలో వేరియషన్స్ కి అంతా బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే బన్నీ తెలుగమ్మాయిలు పరిశ్రమకి రావాలి..ఇక్కడ మనవాళ్లు కూడా ఉండాలని బలంగా కోరుకున్నాడు. అటుపై అల్లు అరవింద్ కూడా వైష్ణవి పనితనాన్ని ప్రశంశింసించారు. ఆ తర్వాత దర్శకుడు బుచ్చిబాబు తన తదుపరి సినిమా లో తెలుగు అమ్మాయినే హీరోయిన్ గా పెడతానని ప్రామిస్ చేసారు. ఇక నిన్న జరిగిన విజయోత్సవంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.
వైష్ణవి ని మెగాస్టార్ సైతం ఎంతో మెచ్చారు. మొత్తంగా వైష్ణవి కి మెగా అండదండలు పుష్కలంగా దక్కాయి. ఇంతవరకూ ఏ తెలుగు నటి ని మెగా నటులంతా ఇంతగా ప్రోత్సహించలేదు. ఎంతో మంది తెలుగమ్మాయిలు వచ్చారు. వెళ్లారు.
కానీ వాళ్లెవ్వరికీ రాని ప్రశంసలు వైష్ణవికి మెగా కుటుంబం నుంచి దక్కాయి. ఆరకంగా వైష్ణవి నేటి తరం తెలుగు హీరోయిన్లందరి లో ఓ మెట్టు పైనే ఉందని చెప్పొచ్చు.అయితే ఈ మెగా ప్రశంస ఆమె కెరీర్ కి సోపానంగా మారుతుందా? మెగా ఫ్యామిలీ అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తుందా? అన్నది చూడాలి.
ఆ ప్రశంస కేవలం ప్రశంసగానే మిగిలిపో కుండా అవకాశం తెచ్చిపెట్టేలా చేస్తే వైష్ణవి కి పరిశ్రమలో మంచి భవిష్యత్ ఉంటుంది. ఎందుకంటే టాలీవుడ్ లో హీరోయిన్ అవకాశం అన్నది అంత ఈజీ కాదు. ఇక్కడి దర్శక-నిర్మాతలు ఇతర భాషల హీరోయిన్లకు ఇచ్చే ప్రాధాన్యత తెలుగు అమ్మాయిల కు ఇవ్వరు అన్న విమర్శ ఎప్పటి నుంచో ఉండనే ఉంది. కొత్త భామల నుంచి నిత్యం పోటీ ఉండనే ఉంటుంది.
ఆ పోటీ ని తట్టుకుని నిలబడాలి. అలా జరగాలంటే మెగా ప్రశంసతో వైష్ణవి అవకాశాలు అందుకుని బిజీ స్టార్ గా మారినప్పుడే ఆ ప్రశంసకి సార్ధకత. వైష్ణవి కూడా టాలీవుడ్ భవిష్యత్ పై చాలా ఆశలే పెట్టుకుంది. ఏనిమిదళ్లగా ప్రయత్నిస్తే బేబిలో అవకాశం వచ్చింది. ఆ చాన్స్ ని వైష్ణవి సద్వినియోగం చేసుకుంటుంది.
కంటెంట్ బోల్డ్ గా ఉన్నా ఎంతో ధైర్యంగా ఆ పాత్ర పోషించింది. సాధారణంగా తెలుగు అమ్మాయిలు అంత బోల్డ్ కంటెంట్ లో నటించడానికి ఆసక్తి చూపించరు. కానీ వైష్ణవి వచ్చే విమర్శలు పట్టించుకోకుండా ఎంతో ఫ్యాషన్ తో సినిమా చేసింది.