ఐకాన్ స్టార్ తో సందీప్ ఎందుకు కుద‌ర‌డం లేదు?

ఆ పాత్ర‌ని ద‌ర్శ‌కుడు ఎంత బ‌లంగా రాసాడో అంత‌కు మించి బ‌లంగా ఆ ఆ పాత్ర‌ని పండించడంలో విజ‌య్ రెండోద‌ల శాతం స‌క్సెస్ అయ్యాడు.

Update: 2024-02-04 06:11 GMT

విజ‌య్ దేవ‌ర‌కొండ‌-సందీప్ రెడ్డి వంగా కాంబినేష‌న్ లో రిలీజ్ అయిన 'అర్జున్ రెడ్డి' ఎలాంటి సంచ‌ల‌నాలు న‌మెదు చేసిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా తెలుగు మార్కెట్ ని షేక్ చేసి..అక్క‌డ నుంచి బాలీవుడ్ కి రీమేక్ రూపంలో వ‌సూళ్ల సునామీ చూపించింది. అర్జున్ రెడ్డి పాత్ర విజ‌య్ కోసమే పుట్టింది అన్నంత గొప్ప‌గా న‌టించ‌డంతోనే ఇది సాధ్య‌మైంది. అత‌డు త‌ప్ప మ‌రో న‌టుడైతే ఆపాత్ర‌కి న్యాయం చేయ‌లేడ‌నిపించింది.

ఆ పాత్ర‌ని ద‌ర్శ‌కుడు ఎంత బ‌లంగా రాసాడో అంత‌కు మించి బ‌లంగా ఆ ఆ పాత్ర‌ని పండించడంలో విజ‌య్ రెండోద‌ల శాతం స‌క్సెస్ అయ్యాడు. అందుకే ఆ సినిమా అంత హిట్ అయింది. అయితే అర్జున్ రెడ్డి క‌థ‌ని వంగా రాసింది మాత్రం వేరొక‌రకి అట‌. అల్లు అర్జున్ ని దృష్టిలో పెట్టుకుని క‌థ మొత్తం రాసాడుట‌. కేవ‌లం అత‌డిని ఇమేజినేష‌న్ చేసుకునే స్ట‌రీ మొత్తం సిద్దం చేసిన‌ట్లు తెలిపాడు. బ‌న్నీని క‌లిసి క‌థ చెప్పాల‌నుకున్నాడుట‌. కానీ కుద‌ర‌క‌పోవ‌డంతో అప్పుడు విజయ్ దేవ‌ర‌కొండ వ‌ద్దకు వెళ్లిన‌ట్లు చెప్పాడు.

ఒక‌వేళ బ‌న్నీ చేస్తే గ‌నుక అది నెక్స్ట్ లెవ‌ల్ మూవీ అవుతుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. బ‌న్నీ కున్న మాస్ ఇమేజ్ కి అలాంటి క‌థ ప‌డితే అత‌ని రేంజ్ కూడా మారిపోయేది. బ‌న్నీ కి ఆ చిత్రం ఓ కొత్త ఇమేజ్ని తెచ్చి పెట్టేది అన‌డంలో ఎలాంటి డౌట్ లేదు. అలాంటి పాత్ర‌ల్ని చింపేస్తాడు. యాంగ‌ర్ మేనేజ్ మేంట్ మీద బ‌న్నీ చేసిన సూర్య రోల్ ఎంత‌గా ప‌డిందో తెలిసిందే. ఆ సినిమా క‌మ‌ర్శియ‌ల్ గా వ‌ర్కౌట్ కాన‌ప్ప‌టికీ బ‌న్నీ పెర్పార్మెన్స్ కి ఫిదా అయ్యారంతా. అలాంటింది అర్జున్ రెడ్డి లాంటి రోల్ ప‌డితే బ‌న్నీ చెల‌రేగిపోతాడు.

అయితే 'అర్జున్ రెడ్డి' స‌క్సెస్ త‌ర్వాత బ‌న్నీని సందీప్ క‌లిసి మ‌రో క‌థ కూడా చెప్పాడుట‌. కానీ ఒకే అయిన‌ట్లు లేదు. అయితే అప్ప‌టికి యానిమ‌ల్ స‌క్స‌స్ సందీప్ ఖాతాలో లేదు. అదే స‌క్సెస్ త‌ర్వాత బ‌న్నీని అప్రోచ్ అయి ఉంటే ఛాన్స్ దొరికేసేది. సందీప్ ఇప్పుడు ట్రై చేస్తే బ‌న్నీ నో చెప్ప‌డానికి ఛాన్సే ఉండ‌దు.


Tags:    

Similar News